బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: భూమా అఖిలప్రియ ఫోన్ల స్వాధీనానికి పోలీసుల ప్రయత్నం

By narsimha lodeFirst Published Jan 15, 2021, 5:57 PM IST
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు చెందిన  రెండు సెల్ ఫోన్లను  స్వాధీనం చేసుకొనేందుకు గాను పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు చెందిన  రెండు సెల్ ఫోన్లను  స్వాధీనం చేసుకొనేందుకు గాను పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఈ కిడ్నాప్ కోసం అఖిలప్రియతో పాటు నిందితులు కొత్త సిమ్ కార్డులు ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. అఖిలప్రియ ఉపయోగించిన నెంబర్ ను పోలీసులు గుర్తించారు. 

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసుతో సంబంధం లేదు: ఇబ్రహీంపట్నం పోలీసులకు దేవరకొండ వెంకటేశ్వరరావు ఫిర్యాదు

ఈ నెల 5వ తేదీన బోయిన్ పల్లిలో కిడ్నాప్ జరిగిన సమయంలో విజయవాడ నుండి అఖిలప్రియ ఫోన్ లో మాట్లాడుకొంటూ హైద్రాబాద్ కు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో రెండు ఫోన్లను ఉపయోగించారని పోలీసులు గుర్తించారు.

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్: తెరపైకి భూమా జగత్ విఖ్యాత్ పేరు, గాలింపు

 అరెస్ట్ చేసే సమయంలో  రెండు సెల్ ఫోన్లను  ఆఖిలప్రియ తన ఇంట్లోనే వదిలేసింది. ఈ ఫోన్లను విశ్లేసిస్తే  మరిన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని కూడ పోలీసులు భావిస్తున్నారు.అఖిలప్రియ నివాసం ఉన్న ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఈ ఇంట్లోని సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొనేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు.

హైద్రాబాద్ హఫీజ్‌పేటలో  సుమారు 33 ఎకరాల భూమికి సంబంధించి భూమా అఖిలప్రియ కుటుంబంతో ప్రవీణ్ రావు కుటుంబానికి వివాదం నెలకొందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ వివాదానికి సంబంధించే ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులను  కిడ్నాప్ చేశారని పోలీసులు ప్రకటించారు.ఈ కేసులో ఇంకా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ , సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్, గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

click me!