హైద్రాబాద్ కోఠిలో రూ.70 లక్షలు సీజ్:ఐదుగురు అరెస్ట్

Published : Oct 23, 2022, 04:15 PM ISTUpdated : Oct 23, 2022, 04:59 PM IST
హైద్రాబాద్ కోఠిలో  రూ.70 లక్షలు సీజ్:ఐదుగురు అరెస్ట్

సారాంశం

నగరంలోని  కోఠిలో  రూ.70 లక్షలను పోలీసులు  ఆదివారం నాడు సీజ్  చేశారు. ఈ నగదు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్: నగరంలోని కోఠిలో రూ. 70 లక్షలను  ఆదివారం నాడు పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదును తరలిస్తున్న ఐదుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. మునుగోడు ఉప  ఎన్నికల నేపథ్యంలో   ఈ  నగదును తరలిస్తున్నారా అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.బేగం బజారు  నుండి కొందరు  మునుగోడుకు డబ్బును తరలిస్తున్నట్టుగా  పోలీసులకు  సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు ఈ నగదును స్వాధీనం  చేసుకున్నారు.

ఇవాళ  ఉదయం కూడ  రూ.10  లక్షలను  పోలీసులు  సీజ్  చేశారు.పంజాగుట్ట పోలీస్ స్టేషన్  పరిధిలో  ఈ  ఘటన  చోటు  చేసుకుంది.  హవాలా  మార్గంలో  నగదును  తరలిస్తున్న  సమయంలో  పోలీసులు  సీజ్  చేశారు. నగదును తరలిస్తున్న ఇద్దరిని  పోలీసులు అరెస్ట్  చేశారు.హైద్రాబాద్ లో  ఇటీవల  కాలంలో హవాలా  రూపంలో  నగదును తరలిస్తుండగా పలువురు పోలీసులకు పట్టబడ్డారు.

ఈ  నెల 11న  హైద్రాబాద్ బంజారాహిల్స్ లో రూ. 2 కోట్ల విలువైన హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు.  నాలుగు రోజుల వ్యవధిలో హైద్రాబాద్ లో రూ. 10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.  నగరానికి  చెందిన  వ్యాపారికి  చెందిన నగదుగా  పోలీసులు గుర్తించారు. ఈ నెల  10న  హైద్రాబాద్ గాంధీ నగర్ లో భారీగా నగదును సీజ్ చేశారు. రూ. 3.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు..  వాహనాలను తనిఖీలు చేసే సమయంలో కారులో నగదును తరలిస్తుండగా పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. 

 ఈ నెల 7న జూబ్లీహిల్స్ లో రూ. 50లక్షలను  హవాలా రూపంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ నెల 8వ తేదీన పాతబస్తీలో రూ.79 లక్షలను పోలీసులు సీజ్  చేశారుఈ నెల 9వ తేదీన హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో రూ. 2.5 కోట్ల విలువైన నగదును పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదు తరలిస్తున్న సమయంలో  పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

 ఈ  నెల  21న  హైద్రాబాద్  నగరంలో  సుమారు  కోటికిపైగా  నగదును  పోలీసులు సీజ్  చేశారు. నలుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు నగదును  తరలిస్తున్న  కారుతో పాటు  నలుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు.

alsoread:హైద్రాబాద్‌లో హవాలా కలకలం: రూ. 10 లక్షల నగదు సీజ్ , పోలీసుల అదుపులో ఇద్దరు

2020  సెప్టెంబర్ 15న  రూ. 3.75 కోట్ల నగదును పోలీసులు  సీజ్ చేశారు. ఈ నగదును తరలిస్తున్న  నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  హవాలా రూపంలో  ఈ  నగదును  తరలిస్తున్న  సమయంలో  పోలీసులు సీజ్  చేశారు. 2020 అక్టోబర్ 31న  హైద్రాబాద్  టాస్క్ పోర్స్  పోలీసులు రూ. 30  లక్షల నగదును సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే