సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు : తెలంగాణ వ్యాప్తంగా నాకాబందీ చేసిన పోలీసులు...

By AN TeluguFirst Published Sep 15, 2021, 11:15 AM IST
Highlights

ఇప్పటికే బస్టాండ్, బస్సుల్లో నిందితుడి ఆనవాళ్లు ఉన్న పోస్టర్లను అతికించారు.  ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం హైదరాబాద్ ను జల్లెడ పడుతున్నారు.

తెలంగాణలో కలకలం రేపిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీనికోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తు్నారు. కాగా, దీనిమీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ ఉద్యోగులను అలర్ట్ చేశారు. 

ఇప్పటికే బస్టాండ్, బస్సుల్లో నిందితుడి ఆనవాళ్లు ఉన్న పోస్టర్లను అతికించారు.  ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం హైదరాబాద్ ను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నిందితుడి మీద పోలీసు శాఖ రూ. 10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 

సైదాబాద్ బాలికపై రేప్, హత్య: హైదరాబాద్ సీపీ ఉన్నత స్థాయి సమీక్ష.. నిందితుడి కోసం 100 మంది పోలీసులు

కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి క్రైమ్స్ అదనపు సీపీ, ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు హాజరయ్యారు. నిందితుడి కోసం 100 మంది పోలీసులతో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకునేందుకు మరో 10 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

click me!