ఓ తరం యువత జీవితాలను నాశనం చేశావ్...: కేసీఆర్ కు బండి సంజయ్ ఘాటు లేఖ

By Arun Kumar PFirst Published Sep 15, 2021, 10:46 AM IST
Highlights

తెలంగాణలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ కు బిజెపి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని వీడకుంటే బిజెపి శ్రేణుల నుండి ఆందోళనను చవిచూడాల్సి వుంటుందని హెచ్చరించారు. 

హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసి బ్యాక్ లాగ్ పోస్టులపై శ్వేత పత్రం విడుదలచేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సంజయ్  డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భ్రుతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
 
''ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గత 15 రోజులుగా భాగ్యనగరం(హైదరాబాద్), ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే ప్రతిచోటా విద్యావంతులైన నిరుద్యోగుల నుండి నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగ బ్రుతిపైనే ఎక్కువగా వినతిపత్రాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఈ సమస్యలను మీ ద్రుష్టికి తీసుకురావాల్సిన బాద్యత మాపై వుంది. అందుకే నిరుద్యోగుల పక్షాన మీకు లేఖ రాస్తున్నాను'' అని సంజయ్ పేర్కొన్నారు. 

''తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కారణమైన ప్రధాన డిమాండుల్లో ఒకటి ఉద్యోగ నియామకాలు. ఇందుకోసమే తెలంగాణలోని విద్యావంతులు పెద్దఎత్తును ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలా సాధించుకున్న రాష్ట్రంలో మీ పాలన మొదలయ్యాక వారి ఆశలన్నీ అడియాశలయ్యాయని చెప్పాలి. స్వరాష్ట్రంలోనూ ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ పాలనలో ఉద్యోగాల భర్తీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. మీ ప్రభుత్వం ఓ తరం విద్యావంతులైన యువతీ యువకుల జీవితాలను నాశనం చేసింది. ఆ ఘనత మీకే దక్కుతుంది'' అని మండిపడ్డారు.

READ MORE  తుపాకీ రాముడి మాటలు పట్టించుకోను: కేటీఆర్ రాజీనామా సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్

''మలిదశ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని మీరు, టీఆర్ఎస్ నేతలు పది సంవత్సరాల పాటు ఊదగొట్టారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం మీ కుటుంబసభ్యులు బంధువులు మాత్రమే డజన్ల ఉద్యోగాలు పొందారు. కానీ రాష్ట్రంలో ఖాళీగా వున్న 2లక్షల ఉద్యోగాల భర్తీ మాత్రం చేపట్టలేదు.  తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కేవలం మీ కుటుంబసభ్యులు, బంధువులకు ఉద్యోగాల కోసం కాదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి'' అని అన్నారు.

''నిరుద్యోగ భ్రుతి కింద విద్యావంతులైన యువతీ, యువకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష బకాయి పడింది. ఇలా ఇప్పటివరకు బకాయిపడిన లక్ష రూపాయలను నిరుద్యోగ యువతీయువకులకు వెంటనే అందించాలి'' అని సంజయ్ డిమాండ్ చేశారు.

''టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం అటుంచి 7651మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుండి తొలగించింది. ఇలా ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులను భరించలేక ఇప్పటికే 50మంది చనిపోయారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొండి'' అని డిమాండ్ చేశారు.

''రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో నిర్లక్ష్యం వహించినా, ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ బ్రుతి ఇవ్వకపోయినా శాంతియుతంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు బిజెపి, దాని అనుబంధ సంఘాలు చేపడాయి'' అంటూ సీఎం కేసీఆర్ ను బండి సంజయ్ హెచ్చరించారు. 


 

click me!