నకిలీ వాట్సాప్ సందేశాలు: లక్షలు కొల్లగొడుతున్న మహిళ కోసం గాలింపు

By narsimha lodeFirst Published Aug 13, 2020, 10:24 AM IST
Highlights

విదేశాల్లో స్నేహితులున్న హైద్రాబాదీల నుండి లక్షలు కొల్లగొడుతున్న ఓ కిలేడీ గురించి హైద్రాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. నకిలీ వాట్సాప్ సందేశాలు పంపుతూ ఆ యువతి బాధితుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

హైదరాబాద్: విదేశాల్లో స్నేహితులున్న హైద్రాబాదీల నుండి లక్షలు కొల్లగొడుతున్న ఓ కిలేడీ గురించి హైద్రాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. నకిలీ వాట్సాప్ సందేశాలు పంపుతూ ఆ యువతి బాధితుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి.ఐరోపా, అమెరికాతో పాటు విదేశాల్లో స్నేహితులున్న హైద్రాబాద్ లను లక్ష్యంగా చేసుకొని ఓయువతి లక్షలు కొల్లగొడుతోంది. 

నకిలీ వాట్సాప్ సందేశాలను పంపుతూ  డబ్బులు లాగుతోంది. వారం రోజుల క్రితంహైద్రాబాద్ లో నివాసం ఉంటున్న ఓ ఉపాధ్యాయుడికి అమెరికాలో ఉన్న అతని స్నేహితుడు డబ్బులు పంపాలని కోరినట్టుగా వాట్సాప్ లో సందేశం పంపింది కి'లేడీ'.
ఈ సందేశం చూసిన ఆ ఉపాధ్యాయుడు తన స్నేహితుడికి రూ. 3లక్షలు పంపాడు. కిలేడీ పంపిన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశాడు. 

డబ్బు ముట్టిందా అంటూ స్నేహితుడికి ఉపాధ్యాయుడు ఫోన్ చేశాడు. తాను డబ్బులు అడగలేదని విదేశాల్లో ఉన్న స్నేహితుడు చెప్పడంతో మోసపోయినట్టుగా ఉపాధ్యాయుడు తెలుసుకొని వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. మహారాష్ట్రలో ఉంటున్న యువతి ఈ డబ్బులు కాజేసినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు. 

బేగంపేటలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఖాతాను ఈ యువతి ఉపాధ్యాయుడికి ఇచ్చింది. ఈ ఖాతాలో లావాదేవీలు నిలిపివేయాలని పోలీసులు బ్యాంకు అధికారులకు సూచించారు.

ఈ విషయమై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.తన స్నేహితురాలు తన బ్యాంకు ఖాతాలో రూ. 3 లక్షలను కొద్ది రోజుల క్రితం జమ చేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఆ డబ్బులను తనకు బదిలీ చేయాలని కోరితే తాను అంగీకరించినట్టుగా ఆయన పోలీసులకు వివరించారు.

ఫ్రాన్స్ లో ఆమె తనకు పరిచయమైందన్నారు. ఇండియాకు వచ్చిన సమయంలో అప్పుడప్పుడూ మాట్లాడుకొంటున్నట్టుగా పోలీసులకు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆమె పుణెలో ఉంటున్నట్టుగా చెప్పిందని టెక్కీ పోలీసులకు వివరించారు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

click me!