
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో (amnesia pub rape case) నిందితుల మూడో రోజు కస్టడీ ముగిసింది. ఇవాళ మైనర్లతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు (jubilee hills police) . ఏ1 సాదుద్దీన్ మాలిక్‌తో కలిసి మైనర్లను ప్రశ్నించారు. కస్టడీ ముగిసిన అనంతరం మైనర్లను జువైనల్ హోమ్‌కు, సాదుద్దీన్‌ను జైలుకు తరలించారు. రేపు ఉదయం మైనర్లను మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు.
అంతకుముందు ఆదివారం ఉదయం కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ (scene reconstruction) చేయించారు పోలీసులు. అమ్నిషియా పబ్, కాన్సూ బేకరి ప్రాంతాలకు మైనర్లను తీసుకెళ్లిన పోలీసులు నేరం జరిగిన రోజు ఏం జరిగిందనే వివరాలు సేకరించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, 44లలో మైనర్లను తీసుకెళ్లిన ఘటన స్థలాన్ని పరిశీలించారు. పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నేరం ఎలా జరిగిందనేది నమోదు చేసుకన్నారు.
ఇక, ఈ కేసులో పోలీసులు పక్కా సాక్ష్యాధారాలు సేకరించేపనిలో ఉన్నారు. సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లకు ఉస్మానియా ఆసుపత్రిలో ఈరోజు లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించారు. చార్జీషీటు దాఖలు చేసే సమయంలో ఈ వివరాలు కీలకంగా ఉండనున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక, ఈ కేసులో ఏ1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. కస్టడీ ముగియగానే సాదుద్దీన్‌ను పోలీసులు న్యాయమూర్తి హాజరుపరచనున్నారు.
మరోవైపు జువైనల్ హోంలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు ప్రశ్నించిన సమయంలో కీలక విషయాలను వెల్లడించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ఈ కథనం మేరకు బాలిక మెడపై గాయాలపై కూడా నిందితులు పోలీసుల విచారణలో కీలక సమాచారం ఇచ్చారు. టాటూ మాదిరిగా ఉంటుందని మైనర్ బాలిక మెడపై కోరికినట్టుగా నిందితులు చెప్పారని సమాచారం. అయితే బాలిక ప్రతిఘటించడంతో గాయాలయ్యాయని పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారని ఆ టీవీ చానెల్ కథనం ప్రసారం చేసింది. ఇక, ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్లో ఒక్క సాదుద్దీన్ మాలిక్ మాత్రమే మేజర్. మిగిలిన ఐదుగురు కూడా మైనర్లే. మైనర్లలో ఒకరు యువతిపై అత్యాచారానికి పాల్పడలేదని.. అసభ్యంగా మాత్రమే ప్రవర్తించారని పోలీసులు చెప్పారు