జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఎల్లుండి అసలు ఘట్టం... అప్రమత్తమైన పోలీస్ శాఖ

By Siva KodatiFirst Published Nov 29, 2020, 7:25 PM IST
Highlights

 అల్లర్లు జరిగే అవకాశం వుందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ  నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార గడువు ముగియడంతో అసలు ఘట్టానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో పాటు అల్లర్లు జరిగే అవకాశం వుందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ  నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సుమారు 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

1,704 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 1,085 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. గ్రేటర్ వ్యాప్తంగా 50 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1500 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు.

ఎన్నికల సందర్భంగా 3,744 వెపన్స్ డిపాజిట్ చేశారు. జోన్ల వారిగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారిగా ఇంచార్జ్‌ ఏసీపీ, సీఐలను ఉన్నతాధికారులు నియమించారు.

Also Read:ముగిసిన ప్రచారం,జీహెచ్ఎంసీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: ఎస్ఈసీ పార్ధసారథి

ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన నేతలపై 55 కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీల్లో ఇప్పటి వరకు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సోషల్‌ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. 

హెచ్‌ఎంసీ పరిధిలో మొత్తంగా 74,67,256 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 38,89,637 పురుషులు, మహిళలు 35,76,941 మంది, 678 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు.

మొత్తంగా 9,101 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. వాటిలో 22,272 కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు పార్థసారథి వెల్లడించారు.  150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

వీరిలో టీఆర్ఎస్ 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, స్వతంత్ర అభ్యర్ధులు 415 మంది బరిలో వున్నారు.

click me!