ముగిసిన ప్రచారం,జీహెచ్ఎంసీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: ఎస్ఈసీ పార్ధసారథి

By narsimha lodeFirst Published Nov 29, 2020, 6:33 PM IST
Highlights

ఎల్లుండి జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి చెప్పారు.


హైదరాబాద్: ఎల్లుండి జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి చెప్పారు.


ఆదివారం నాడు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారధి మీడియాతో మాట్లాడారు.  ఇవాళ సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారానికి గడువు పూర్తైందన్నారు. గడువు పూర్తైన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 2336 సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. 1207 అతి సున్నితమైనవి, 279 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్టుగా ఆయన చెప్పారు.

1729 మందిని సూక్ష్మ అభ్యర్ధులుగా నియమించామన్నారు. పోలింగ్ విధుల కోసం 36 వేల 404 మందిని నియమించినట్టుగా ఆయన తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల కోసం 18  వేల 202 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నామని ఎన్నికల సంఘం కమిషనర్ చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం 2 వేల 629 మంది ధరఖాస్తు చేసుకొన్నారని ఆయన తెలిపారు.

జీహెచ్ఎంసీలో 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.

60 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు. 

పోలింగ్ రోజున పోలింగ్ మెటీరియల్ పంపిణీ కోసం 661 రూట్లను ఏర్పాటు చేశామన్నారు. 661 జోనల్ ఆఫీసర్లతో పాటు, రూట్ ఆఫీసర్లను కూడా నియమించామని ఆయన వివరించారు.

పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ సిబ్బందికి లక్షకు పైగా కోవిడ్ కిట్స్ ను సరఫరా చేశామన్నారు. ఇప్పటివరకు 90 శాతం మంది ఓటర్లకు ఓటరు స్లిప్పులను సరఫరా చేశామని ఆయన తెలిపారు.

click me!