హైదరాబాద్‌లో బాణాసంచా ఈ టైంలోనే కాల్చాలి .. హద్దు మీరితే , ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

By Siva Kodati  |  First Published Nov 10, 2023, 7:42 PM IST

హైదరాబాద్ నగరంలోనూ బాణాసంచా కాల్చడంపై నగర పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. దీపావళి రోజున జంట నగరాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పటాకులు పేల్చాలని పోలీసులు తెలిపారు. 


దీపావళికి బాణాసంచా కాల్చాలని చిన్నా, పెద్దా అంతా కోరుకుంటారు. పండక్కి నెల రోజుల ముందు నుంచే రకరకాల బాణాసంచా కొనుగోలు చేసి వాటిని ఆరు బయట ఎండలో వుంచి సంబరపడే వాళ్లు ఎంతోమంది. అయితే పెరిగిన కాలుష్యం, మారిన వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో దీపావళి నాడు బాణాసంచా కాల్చేందుకు ప్రభుత్వాలు, న్యాయస్థానాలు అనుమతులు ఇవ్వడం లేదు. అన్ని ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్ నగరంలోనూ బాణాసంచా కాల్చడంపై నగర పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. 

పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పోలీసులు ప్రజలను కోరారు. దీపావళి రోజున జంట నగరాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పటాకులు పేల్చాలని పోలీసులు తెలిపారు. పరిమితికి మించి శబ్ధం వచ్చే టపాసులు కాల్చొద్దని.. దీని వల్ల వాయు, శబ్ధ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నారు. గ్రీన్ కాకర్స్‌తో పండుగ జరుపుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఈ ఆదేశాలు అమల్లో వుంటాయని పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

Latest Videos

undefined

Also Read: ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్ పై నిషేధం యథావిధిగా కొనసాగుతుంది: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ఇకపోతే.. దేశ రాజధానిలో ఫైర్ క్రాకర్స్ విక్రయించడం, కొనుగోలు చేయడం, పేల్చడంపై నిషేధం యథావిధంగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీలో బాణా సంచాపై నిషేధాన్ని ఎత్తేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఫైర్ క్రాకర్స్ పై బ్యాన్‌ను నిషేధించబోమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఫైర్ క్రాకర్స్ బ్యాన్‌కు సంబంధించి తమ ఆదేశాలు విస్పష్టమైనవని తెలిపింది. అవి గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ వాటిని ఎలా అనుమతించగలం అని వివరించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని మీరు చూశారా? అంటూ పిటిషనర్‌ను అడిగింది. దీపావళి తర్వాత ఢిల్లీ, ఎన్సీఆర్‌లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని తెలిపింది. పరిస్థితులు దారుణంగా మారుతాయని పేర్కొంది.

click me!