దీపావళి సెలవులో మార్పు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గతంలో నవంబర్ 12న దీపావళి సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా దీనిని నవంబర్ 13కి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అధిక మాసం తదితర కారణాలతో ఈసారి తెలుగు నాట పండుగలు జరుపుకునే విషయంలో కన్‌ఫ్యూజన్ నెలకొంది. తిథులు, నక్షత్రాల ఆధారంగా మన పండుగలు వుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి సగం తిథి ఓ రోజున.. మిగిలినది మరో రోజున రావడంతో పండుగలు ఏ రోజు జరుపుకోవాలో తెలియని పరిస్ధితి నెలకొంది. తాజాగా దీపావళి విషయంలోనూ ఇదే కన్‌ఫ్యూజన్ ఎదురవుతోంది.
ఇకపోతే.. దీపావళి సెలవులో మార్పు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గతంలో నవంబర్ 12న దీపావళి సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా దీనిని నవంబర్ 13కి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాలలు, ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు కూడా మార్పులు చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పండితుల సూచన మేరకు సెలవు దినాన్ని మార్చినట్లుగా ప్రభుత్వం తెలిపింది. సర్కార్ నిర్ణయం కారణంగా రేపు రెండో శనివారం, ఆదివారం, మరుసటి రోజున దీపావళి కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి.
undefined
Also Read: Diwali 2023 : దీపావళి సెలవు తేదీలో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
అటు ఏపీ ప్రభుత్వం కూడా దీపావళి సెలవును నవంబర్ 13వ తేదీకి మార్చింది. 12వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవు గా పేర్కొంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన లీవ్స్ లిస్టులో నవంబర్ 12వ తేదీన ఆదివారం దీపావళిగా, అదే రోజు సెలువుగా ఉంది. కానీ ఆదివారం ఎలాగూ గవర్నమెంట్ హలీడే కాబట్టి సెలవులో మార్పు చేశారు. ఈ నెల 13వ తేదీ ఆప్షనల్ హాలీడే గా ఉంది. అయితే దానిని ఇప్పుడు సాధారణ సెలవుగా ప్రభుత్వం మార్చింది.