సస్పెన్షన్ కు గురైన మారేడ్ పల్లి సీఐ నాగేశ్వర్ రావును హయత్ నగర్ లోని జడ్జి ముందు సోమవారం నాడు రాత్రి పోలీసులు హాజరు పర్చారు. అత్యాచారం,కిడ్నాప్, బెదిరింపులు, ఆర్మ్స్ యాక్ట్ కింద నాగేశ్వర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: సస్పెన్షన్ కు గురైన marredpally ci నాగేశ్వర్ రావు ను హయత్ నగర్ లో ఉన్న న్యాయమూర్తి నివాసంలో న్యాయమూర్తి ముందు హజరుపర్చారు.అత్యాచారం, కిడ్నాప్, బెదిరింపులు, ఆర్మ్స్ యాక్ట్ కింద Nageshwar Raoపై కేసులు నమోదయ్యాయి.ఈ నెల 7వ తేదీన హఃస్తినాపురం వద్ద వివాహిత ఇంటికి వెళ్లి ఆమెపై సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూడా సీఐ నాగేశ్వరరావు మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకొంది. అంతేకాదు భార్యాభర్తలను సీఐ నాగేశ్వరరావు బెదిరించాడని బాధితులు పిర్యాదు చేశారు.
తమను తుపాకీతో బెదిరించినట్టుగా కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. అంతేకాదు తన కారులోనే బాఁధితులను ఇబ్రహీంపట్నం వైపునకు తీసుకెళ్తున్న సమయంలో సీఐ కారు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదం జరిగిన తర్వాత భార్యాభర్తలు అక్కడి నుండి వెళ్లిపోయారు. అదే రోజున వనస్థలిపుం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా హైద్రాబాద్ సీపీ సీవీ Anandమారేడ్ పల్లి సీఐ నాగేశ్వర్ రావును సస్పెండ్ చేస్తూ ఆదశాలు జారీ చేశారు.
undefined
ALSO READ:మహిళను కిడ్నాప్, అత్యాచారం: లొంగిపోయిన సీఐ నాగేశ్వరరావు.. రెండ్రోజులుగా అజ్ఞాతంలోనే
మారేడ్ పల్లి సీఐ నాగేశ్వర్ రావు ఆదివారం నాడు పోలీసులకు లొంగిపోయాడు. నాగేశ్వర్ రావుపై నమోదైన కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. బాధితురాలి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీతో పాటు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీని కూడా పోలీసులు సేకరించినట్టుగా ఆ చానెల్ కథనం ప్రసారం చేసింది. వనస్థలిపురం ఎస్ఓటీ కార్యాలయంలో నాగేశ్వర్ రావును ACP ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి నాగేశ్వరరావును పోలీసులు విచారించిన తర్వాత ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు.