
హైదరాబాద్: హైదరాబాద్ సైబర్ క్రైం ఏసిపి కేవీఎం ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగురోడ్డుపై ఏసిపి కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. దీంతో ఏసిపి భార్య శంకరమ్మతో సహా మరోఇద్దరు మృత్యువాతపడ్డారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. hyderabad cyber crime acp కేవీఎం ప్రసాద్ సతీమణి శంకరమ్మ, మరదలితో పాటు మరికొందరు కుటుంబసభ్యులు షిప్ట్ కారులో outer ring road పై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. ఇలా ఘటనా స్థలంలో చనిపోయిన వారిలో ఏసిపి భార్య శంకరమ్మ కూడా వున్నారు.
read more హయత్‌నగర్ : కారులో మృతదేహం.. వీడిన మిస్టరీ, మరిదితో కలిసి భర్తను చంపిన భార్య
మేడ్చల్ జిల్లా కీసర మండలం యాదగిరిపల్లి వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని మరోఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులోంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.