అక్టోబర్ 27న బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ తో ఆయన భార్య జమున సానుభూతి డ్రామా ఆడేే అవకాశాలున్నట్లు సమాచారం వుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
కరీంనగర్: ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే బిజెపి నాయకులు టీఆర్ఎస్ కారుకర్తలను రెచ్చగొట్టి కయ్యానికి దిగుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. Huzurabad Bypoll సందర్భంగా బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల కమీషన్ తో సహా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
హుజూరాబాద్ పట్టణంలోని TRS Party కార్యాలయంలో మాజీ మంత్రి ఈనుగాల పెద్దిరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇల్లందకుంట మండలం సిరిసేడు లో కూడా టీఆర్ఎస్ కార్యాలయం ముందు బిజెపి శ్రేణులు నానా హంగామా చేసాయని... కానీ టీఆర్ఎస్ సంయమనంతో వ్యవహరించిందన్నారు. కమాలపూర్ లో జరిగిన ఆక్సిడెంట్ విషయంలోనూ టీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేసి తప్పుబట్టే ప్రయత్నం చేసారని పల్లా ఆరోపించారు.
undefined
బిజెపి గుండాల నుండి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కావాలని ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు పల్లా తెలిపారు. పోలింగ్ కు ముందు BJP నాయకులు ఎన్నికల డ్రామాలు కూడా చేస్తారన్నారు. ఈ నెల 27న eatala rajender తో పాటు అతడి భార్య జమున సొమ్మసిల్లి పడిపోయే సానుభూతి డ్రామాకు తెరతీయనున్నారని సమాచారం వుందన్నారు. ఇలాంటి చిల్లర డ్రామాలు చేసే ఆలోచనలతో ఈటల దంపతులు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం వుందన్నారు.
read more హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలిస్తే... ఇలా చేస్తాం, ఓటర్లకు హరీశ్ హామీలు
అంతేకాదు ఆరోగ్యం బాగాలేని వారితో ఆత్మహత్యాయత్నం చేయించే అవకాశం కూడా ఉందని palla rajeshwar reddy ఆరోపించారు. ఇలా ఎన్ని నాటకాలాడినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోందని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేసారు.
మాజీ మంత్రి peddireddy మాట్లాడుతూ... తానేదో స్వాతంత్య్ర యోధుడు అయినట్టు ఈటల రాజేందర్ ఊహించుకుంటున్నాడని ఎద్దేవా చేసారు. నిన్న టీఆర్ఎస్ పై బిజెపి నాయకులు దాడి చేద్దామని ప్రయత్నం చేసారన్నారు. తాము మహాత్మా గాంధి లాగ ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపెట్టం... రక్షణ కల్పించుకుంటామన్నారు.
''ఈటల ఆరుసార్లు గెలిచి నియోజకవర్గంలో ఏం చేశాడో చెప్పడం లేదు. ప్రచారానికి కేంద్ర మంత్రులు తెలంగాణకు ఉపయోగపడే ఒక్క ప్రకటన కూడా చేయడంలేదు. రెడ్డిలపై ప్రేమ ఉంటే రెడ్డి కార్పొరేషన్ కావాలని ఎందుకు అడగలేదు? రెడ్డి కులస్తులు అందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ కు అండగా ఉంటారు'' అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.
ఇదిలావుంటే హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రారంభానికి ముందే టీఆర్ఎస్, బిజెపి ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇక నోటిఫికేషన్ వెలువడిన అక్టోబర్ 1నుండి ఈ పార్టీల ప్రచారం మరింత జోరందుకుంది. పోలింగ్ కు మరో ఐదురోజులు మాత్రమే సమయంలో వుండటంతో ఈ ప్రచారం పీక్స్ లో సాగుతోంది.అక్టోబర్ 30న పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితం వెలువడనుంది.