నవీన్ హత్యకేసు: నిందితుడు హరిహర వాట్సాప్ పై పోలీసుల ఆరా

Published : Feb 26, 2023, 01:51 PM ISTUpdated : Feb 26, 2023, 01:59 PM IST
 నవీన్ హత్యకేసు: నిందితుడు హరిహర వాట్సాప్ పై    పోలీసుల ఆరా

సారాంశం

నవీన్  ను అత్యంత దారుణంగా హత్య  చేసిన  హరిహరను కస్టడీని కోరుతున్నారు పోలీసులు.   ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే విషయమై  పోలీసులు ఆరా తీయనున్నారు.    

హైదరాబాద్:  స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన   హరిహరను కస్టడీ కోరుతున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి హరిహరను  లోతుగా విచారించాలని భావిస్తున్నారు. నవీన్ హత్య  కేసులో  హరిహరకు  ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేయనున్నారు.

హరిహర, నవీన్  మధ్య వాట్సాప్  సంభాషణలను  కూడా  పోలీసులు  సేకరించే  ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా  హరిహర తన లవర్ కు మధ్య జరిగిన వాట్సాప్  చాటింగ్ , పోన్ సంభాషణల  విషయ మై కూడ పోలీసులు  ఆరా తీస్తున్నారు.   నవీన్  కన్పించకుండా  పోయిన  విషయమై  హరిహరతో   ఆమె ఫోన్ లో  మాట్లాడిన ఆడియో సంభాషణ కూడా వెలుగు చూసింది. అయితే  నవీన్  గురించి తనకు  తెలియదని  ఆమెకు   హరిహర చెప్పినట్టుగా ఆడియోలో ఉంది.  నవీన్ ను హత్య చేసేందుకు   హరిహర పక్కా ప్లాన్  వేసినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ ను హత్య  చేసేందుకు  కొన్ని రోజుల ముందే  కత్తిని కొనుగోలు చేశాడు. నవీన్  శరీరభాగాలను కోసే సమయంలో  తన వేలిముద్రలు  దొరకకుండా  ఉండేందుకు గాను గ్లౌజులు  వేసుకున్నాడని  పోలీసులు గుర్తించారు.  

also read:నవీన్ హత్య కేసులో ట్విస్ట్: హరిహరకృష్ణపై 23న మిస్సింగ్ కేసు

ఈ నెల  17వ తేదీన  నవీన్ ను హరిహర  తన రూమ్ కి  పిలిపించాడు. పార్టీ కోసం  పిలిపించి   హైద్రాబాద్  శివారులోని అబ్దుల్లాపూర్ మెట్  వద్ద అత్యంత దారుణంగా  నవీన్ ను హత్య చేశాడు.హరిహర, నవీన్ లు ఇద్దరూ  ఇంటర్మీడియట్ లో క్లాస్ మేట్స్ . వీరిద్దరూ  ఒకే యువతిని ప్రేమించారు. ఈ విషయమై   నవీన్ , హరిహర మధ్య గొడవ జరిగింది. లవర్ విషయమై  నవీన్ ను  హరిహర అత్యంత దారుణంగా హత్య చేశాడు.   హరిహర హైద్రాబాద్  మూసారాంబాగ్ లో  బంధువుల ఇంటి వద్ద ఉండి  చదువుకుంటున్నాడు.  నవీన్  నల్గొండలో  చదువుకుంటున్నాడు.  

కాలేజీకి వస్తున్నానని  తనకు ఆహరం తీసి  పెట్టాలని  కూడా  నవీన్ తన స్నేహితులకు  ఫోన్  చేసి చెప్పాడు. అయితే  ఈ ఫోన్ చేసిన   గంటన్నర తర్వాత  నవీన్ కు స్నేహితులు  ఫోన్  చేశారు. కానీ  అతని ఫోన్  స్విచ్ఛాఫ్ వచ్చింది. కాలేజీకి వస్తున్నట్టుగా  చెప్పిన నవీన్  మార్గమధ్యలోనే  హత్యకు గురయ్యాడు.  

నవీన్  గురించి  హరిహరకు  అతని స్నేహితుడు  ఫోన్  చేశాడు. అయితే లవర్ తో ఫోన్ లో గొడవ పెట్టుకుని వెళ్లిపోయాడని  చెప్పాడు. నవీన్ కోసం  పోలీసులకు ఫిర్యాదు చేద్దామని  హరిహర అతని స్నేహితుడికి  సలహ  ఇచ్చాడు.

PREV
click me!

Recommended Stories

KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్