హైద్రాబాద్ మలక్ పేట తీగల గూడ వద్ద మొండెం లేని మహిళ తలను స్థానికులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనస్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట తీగలగూడ వద్ద నల్టటి కవర్ లో మొండెం లేని మహిళ తల కలకలం రేపుతుంది. ఈ విషయాన్ని బుధవారం నాడు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళను ఎక్కడో హత్య చేసి కవర్ లో తలను మూసీ సమీపంలో తీగలగూడ వద్ద వదిలివేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మొండెం ఎక్కడ ఉందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మహిళ ఎవరనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు మొండెం లేని తల మహిళను హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మహిళను హత్య చేసిన దుండగుల కోసం దర్యాప్తును ప్రారంభించారు. సంఘటన స్థలంలో పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు.ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులు ఎక్కడి నుండి ఈ కవర్ ను తీసుకువచ్చారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైద్రాబాద్ లో మహిళలను హత్య చేసి గోనెసంచుల్లో మూట కట్టి పారేసిన ఘటనలు గతంలోకూడ చోటు చేసుకున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆర్ధిక లావాదేవీలు, మద్యం మత్తుల్లో హత్యలు చేస్తున్నారని పోలీసులు తమ దర్యాప్తుల్లో గుర్తించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 12న హైద్రాబాద్ కు సమీపంలోని తుక్కుగూడ సమీపంలో మహిళ డెడ్ బాడీ లభ్యమైంది. మహిళపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ప్లాస్టిక్ బ్యాగులో మహిళ డెడ్ బాడీని నిందితులు వదిలివెళ్లారు.
2018 జనవరి మాసంలో హైద్రాబాద్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో మహిళను హత్య చేసి గన్నీబ్యాగులో వదిలివెళ్లారు నిందితులు. మహిళ శరీర భాగాలను కట్ చేసి బ్యాగులో పెట్టారు దుండగులు.