సబితా ఇంద్రారెడ్డి పీఏల పేరుతో మోసం: మాజీ పీఏ సహా ఏడుగురిపై కేసు

By narsimha lode  |  First Published May 17, 2023, 10:28 AM IST

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పీఏలుగా  చెప్పుకుని  మోసం  చేసిన  ఏడుగురిపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పీఏల పేరుతో   మోసానికి  పాల్పడిన  ఏడుగురిపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు.ప్రభుత్వ స్కూళ్లలో  షూష్  సరఫరా కాంట్రాక్టు  ఇప్పిస్తామని  మోసం  చేసినట్టుగా   ఫిర్యాదులు అందడంతో  పోలీసులు  కేసు నమోదు  చేశారు.

లిబర్టీ  షూస్  లిమిటెడ్  సంస్థ  నుండి  నిందితులు  రూ. 17.5 లక్షలు  వసూలు చేసినట్టుగా  పోలీసులు గుర్తించారు.  సబితా ఇంద్రారెడ్డి  మాజీ పీఏ  కుమార్ తో పాటు  మరో ఏడుగురిపై  పోలీసులు కేసు నమోదు  చేశారు.

Latest Videos

ప్రభుత్వ స్కూళ్లలో  విద్యనభ్యసించే  విద్యార్ధులకు  అవసరమైన   బూట్ల పంపిణీ కాంట్రాక్టును  ఇప్పిస్తామని  లిబర్టీ షూష్ కంపెనీ నుండి  నిందితుల డబ్బులు  వసూలు  చేశారని   ఫిర్యాదులు అందాయి.ప్రభుత్వ స్కూళ్లలో   బూట్ల సరఫరా టెండర్ కోసం లిబర్టీ షూస్  కంపెనీ ప్రతినిధి కమల్ ధావన్ ధరఖాస్తు చేశారు. అయితే మంత్రి సబితా ఇంద్రారెడ్డి  సిబ్బందిగా పేర్కొంటూ  జేకే కుమార్,  బెల్లి తేజ, ఆంజనేయులు, రమేష్ రెడ్డిలే  కమల్  థావన్ ను సంప్రదించారు. లిబర్టీ షూస్ కంపెనీ  ప్రతినిధి నుండి రూ. 17 లక్షలు తీసుకున్నట్టుగా  పోలీసులకు  ఫిర్యాదు అందింది.  లిబర్టీ షూస్ కంపెనీ ప్రతినిధి  కమల్  ధావన్  హైద్రాబాద్ బంజారాహిల్స్  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  

ప్రతి ఏటా  విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో  విద్యార్ధులకు  అవసరమైన  బూట్లు, యూనిఫారం  ప్రభుత్వం  అందిస్తుంది.   ఈ  కాంట్రాక్టు  దక్కించుకొనేందుకు   కంపెనీలు  పోటీపడుతుంటాయి. బూట్ల కాంట్రాక్టును  ఇప్పిస్తామని  నమ్మించి  నిందితులు  డబ్బులు వసూలు  చేశారు.
 

click me!