డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు: శంషాబాద్ సమీపంలో నవీన్ రెడ్డి కారు గుర్తింపు

By narsimha lode  |  First Published Dec 12, 2022, 10:02 PM IST

రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసేందుకు నవీన్ రెడ్డి  ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. ఈ నెల 9వ తేదీన  వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన  నవీన్ రెడ్డి సహా మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఈ నెల  9వ తేదీన  డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశారు.  అయితే  పోలీసులు గాలిస్తున్నారని గమనించి  డాక్టర్ వైశాలిని  నవీన్ రెడ్డి వదిలేశారు. బాధితురాలిని పోలీసులు సురక్షితంగా అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు.అయితే నవీన్ రెడ్డి మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదని సమాచారం.  డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసేందుకు డాక్టర్ నవీన్ రెడ్డి ఉపయోగించిన వోల్వో కారును  సోమవారం నాడు సాయంంత్రం  పోలీసులు గుర్తించారు. శంషాబాద్ కు సమీపంలో పొలాల సమీపంలో  నవీన్ రెడ్డి ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు.  

డాక్టర్ వైశాలిని  కొంత కాలంగా  నవీన్ రెడ్డి వేధిస్తున్నారని  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నవీన్ రెడ్డి ఓ సైకో అని డాక్టర్ వైశాలి చెబుతున్నారు. తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె నిన్న మీడియాకు చెప్పారు. నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని  ఆమె కోరుతున్నారు.

Latest Videos

also read:నవీన్ రెడ్డి ఒక సైకో.. ఏదోలా నన్ను పొందాలని యత్నాలు, నేనెవ్వరికీ బినామీనీ కాదు : డాక్టర్ వైశాలి

లాక్ డౌన్ సమయంలో బాడ్మింటన్ ఆడే సమయంలో  తనకు నవీన్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని  డాక్టర్ వైశాలి చెప్పారు.  వైశాలిని పెళ్లి చేసుకోవాలని కొంత కాలం క్రితం నవీన్ రెడ్డి వైపు నుండి ప్రతిపాదనలు వచ్చాయి.  అయితే  వైశాలి కుటుంబ సభ్యులు మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దీంతో వైశాలి కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకొన్నాడని బాధితులు చెబుతున్నారు.ఈ నెల 9వ తేదీన డాక్టర్ వైశాలికి మరో యువకుడితో నిశ్చితార్ధం ఉన్న విషయం తెలుసుకొని నవీన్ రెడ్డి ఆమెను కిడ్నాప్ చేశారు.  డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసే సమయంలో  నవీన్ రెడ్డికి సహకరించిన వారిలో  32 మందిని ఇప్పటికే  పోలీసులు అరెస్ట్  చేశారు.  పథకం ప్రకారంగానే నవీన్ రెడ్డి తనతో పాటు  కొందరిని తీసుకువచ్చారు. వైశాలి ఇంట్లో ఫర్నీచర్ ను ధ్వంసం చేసి ఆమెను కిడ్నాప్ చేశారు. 

click me!