హైద్రాబాద్ పేలుళ్ల కుట్ర కేసు: కీలక విషయాలను గుర్తించిన పోలీసులు

By narsimha lode  |  First Published Oct 4, 2022, 1:30 PM IST

హైద్రాబాద్ పేలుళ్ల కుట్ర కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. చైనా, నేపాల్ మీదుగా గ్రైనైడ్లు వచ్చినట్టుగా గుర్తించారు.


హైదరాబాద్:హైద్రాబాద్ పేలుళ్ల కుట్ర కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. చైనా,నేపాల్ మీదుగా  ఇండియాకు గ్రైనేడ్లు వచ్చినట్టుగా గుర్తించారు పోలీసులు. జునైద్  వద్దకు గ్రైనేడ్లు ఎలా వచ్చాయనే విషయమై పోలీసులు ఆరా తీశారు. చైనా, నేపాల్ మీదుగా గ్రైనేడ్లు తీసుకు వచ్చారు. ఈ గ్రైనేడ్లను మహరాష్ట్రలోని మనోరాబాద్ కు తెచ్చారు. . బైక్ పై మనోరాబాద్ కు వెళ్లి జాహెద్ నాలుగు గ్రైనేడ్లను హైద్రాబాద్ కు తీసుకు వచ్చాడు.ఈ విషయాన్ని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

 హైద్రాబాద్ లో మూడు చోట్ల  గ్రైనేడ్లతో దాడులు చేయాలని ప్లాన్ చేశారు.  జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో ఈ గ్రైనేడ్లతో దాడి చేయాలని  ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు. మాజ్,,షమీ,జాహెద్ లు ఒకేసారి  ఈ దాడులు చేయాలని  ప్లాన్ చేశారని పోలీసులు  రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  మరో వైపు మజాను సిరియాకు పంపేందుకు జాహెద్ ప్రయత్నించారని కూడా రిమాండ్ రిపోర్టులో లో పోలీసులు తెలిపారని ఆ కథనం తెలిపింది. హవాలా ద్వారా రూ. 30 లక్షలు జాహెద్ కు వచ్చినట్టుగా సిట్ బృందం గుర్తించింది..ఈ డబ్బుతో  యువకులను ఉగ్రవాదం వైపునకు మళ్లించేందుకు ప్రయత్నించారని సిట్ గుర్తించారు. 

Latest Videos

undefined

సామూహిక దాడులతో ప్రజల్లో భయాందోళనలు కలిగించాలని నిందితులు ప్లాన్ చేశారు. అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా దాడులకు ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. షమీ సెల్ ఫోన్ తోనే ఫరాతుల్లాతో   జాహెద్ చాటింగ్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్టు తెలిపింది. 

హైద్రాబాద్ లో భారీగా జనం ఉన్నప్రాంతాల్లో గ్రైనేడ్లు విసిరి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలని నిందితులు ప్లాన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. దసరా ఉత్సవాల్లో   బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై దాడి చేయాలని కూడా నిందితులు ప్లాన్ చేశారని సిట్ గుర్తించింది.బీజేపీ, ఆర్ఎస్ ఎస్ నేతల ఇళ్ల వద్ద రెక్కీ చేశారని ఆ కనం వివరించింది.

హైద్రాబాద్ లో దాడులకు జాహెద్ అబ్దుల్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు..ఈ కుట్రలో జాహెద్ అబ్దుల్ తో పాటు మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్అబ్దుల్ సమీ, మాజ్ హసన్ ఫరూఖ్ అలియాస్ మాజ్  ఉన్నారని పోలీసులు తెలిపారు.ఈ ముగ్గురిని పోలీసులు సోమవారం నాడు  జడ్జి నివాసం వద్దకు తీసుకెళ్లారు. నిందితులకు జడ్జి 14 రోజుల రిమాండ్  విధించారు.

also read:దసరా వేడుకలే టార్గెట్‌‌గా ఉగ్ర కుట్ర.. హైదరాబాద్‌కు తప్పిన ముప్పు, పోలీసుల దర్యాప్తులో కీలకాంశాలు

గతంలో దసరా రోజున  హైద్రాబాద్ సీపీ కార్యాలయం వద్ద  సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడిలో  హోంగార్డు మరణించాడు.  ఈ ఘటనలో సూసైడ్ బాంబర్ కు జాహెద్ ఆశ్రయం ఇచ్చాడు.ఈ కేసులో జాహెద్ 12 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు.   ఈ కేసు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా  జాహెద్ ఉగ్రవాదులతోమళ్లీ లింకులు ఏర్పాటు చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు.దీంతో పోలీసులు  జాహెద్ పై నిఘాను పెంచారు.  హైద్రాబాద్ లో పేలుళ్లకు పోలీసులు కుట్ర పన్నారని  గుర్తించిన పోలీసులు జాహెద్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. 
 

click me!