రాజాసింగ్‌పై నాంపల్లి కోర్టు ఆదేశాలు: హైకోర్టులో పోలీసుల పిటిషన్

By narsimha lodeFirst Published Aug 25, 2022, 2:09 PM IST
Highlights

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని  పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  విషయంలో నాంపల్లి కోర్టు ఆదేశాల పై హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. నాంపల్లి కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని హైకోర్టును కోరారు పోలీసులు.ఈ నెల 23న ఉదయం  మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో  రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం నాంపల్లి కోర్టులో ఆయనను పోలీసులు హజరు పర్చారు. ఈ విషయమై కోర్టులో ఇరు వర్గాల వాదలను విన్న తర్వాత కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది.   41 సీఆర్‌పీసీ కింద ఎలాంటి నోటీసులు జారీ చేయని విషయాన్ని రాజాసింగ్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  

మరో వైపు శాంతిభద్రతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజాసింగ్ ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు కు తెలిపారు.ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు రాజాసింగ్ కు బెయిల్ ను మంజూరు చేసింది.  నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ ను మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇవాళ పోలీసులు  హైకోర్టులో రివిజన్  పిటిషన్ దాఖలు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.  నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు హైకోర్టును కోరారని ఆ కథనం తెలిపింది. 

మునావర్ ఫరూఖీ కామెడీ షో కు వ్యతిరేకంగా రాజాసింగ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియో హైద్రాబాద్ లో ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉన్నాయని  ఎంఐఎం ఆరోపించింది.ఈ విషయమై పాతబస్తీతో పాటు హైద్రాబాద్ సీపీ కార్యాలయం ఎదుట ఎంఐఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  ఈ నెల 22వ తేదీ ఉదయం నుండి 23వ తేదీ ఉదయం వరకు హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు ఎంఐఎం ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.  పాతబస్తీలో  ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. పాతబస్తీలో నిన్న రాత్రి ఏడుగంటలకే దుకాణాలను మూసి వేయించారు. పాతబస్తీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 


 

click me!