బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి షాక్: 'బుల్డోజర్ 'వ్యాఖ్యలపై కేసు

Published : Feb 20, 2022, 11:07 AM ISTUpdated : Feb 20, 2022, 11:21 AM IST
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి షాక్:  'బుల్డోజర్ 'వ్యాఖ్యలపై కేసు

సారాంశం

యూపీలో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లు వస్తాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.ఈ సీ ఆదేశం మేరకు మంగళ్ హాట్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.


హైదరాబాద్: BJPకి చెందిన గోషామహాల్ ఎమ్మెల్యే Raja Singh పై Hyderabad మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం నాడు Caseనమోదైంది. Uttar pradesh Assembly Election 2022 లో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  మంగళ్ హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

గత వారంలో యూపీ ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  బీజేపీకి ఓటేయకపోతే బుల్‌డోజర్లు వస్తాయంటూ వ్యాఖ్యలు చేఃశారు. అంతేకాదు యోగి ఆదిత్యనాథ్ కు ఓటేయకపోతే యూపీని వదిలి వెళ్లాల్సి వస్తోందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ ను వివరణ కోరింది.

ఈ వ్యాఖ్యల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని  రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని కూడా ఈసీ శనివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు మంగళ్ హాట్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. అంతేకాదు  రాజాసింగ్‌పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ.ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పోలింగ్‌కు 72 గంటల ముందు ప్రచారం నిర్వహించొద్దని ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దని రాజాసింగ్‌ని ఆదేశించింది.

 యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని రాజాసింగ్ కోరారు. yogi adityanath కు  ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు. మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్ లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.

దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం తెలంగాణ  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం KCR  రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని కోరారు. ఈ విషయై ఈసీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా  కోరింది.

అయితే ఈసీ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. అఖిలేష్ ప్రభుత్వంలో మాఫియా రాజ్యం నడిచిందని.. యోగి ప్రభుత్వం వచ్చాక మాఫియాను బుల్డోజర్‌ను ఎత్తిపడేశారని రాజాసింగ్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే తాను బుల్డోజర్ వ్యాఖ్యలు చేశానని  ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కొందరు కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం కాకూడదనే ఉద్దేశంతో కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. యోగికి మద్ధతుగా వుండకుంటే మరోసారి హిందువులపై దాడులు జరుగుతాయని రాజాసింగ్ ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?