డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డిని ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

Published : Dec 14, 2022, 03:16 PM IST
 డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డిని ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

సారాంశం

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని  పోలీసులు ఇవాళ ఇబ్రహీంపట్నం కోర్టులో  హాజరు పర్చారు. నిన్ననే నవీన్ రెడ్డిని పోలీసులు గోవాలో అరెస్ట్  చేశారు.  

హైదరాబాద్: డాక్టర్ వైశాలి  కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు  నవీన్ రెడ్డిని  పోలీసులు బుధవారం నాడు ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపర్చారు.  ఈ నెల 9వ తేదీన డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి  తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశారు.నిన్న రాత్రి గోవాలో  నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.ఇవాళ ఉదయం  సరూర్ నగర్ ఎస్ఓటీ కార్యాలయంలో  పోలీసులు ఆయనను ప్రశ్నించారు.  వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇబ్రహీంపట్నం కోర్టులో  నవీన్ రెడ్డిని పోలీసులు  హాజరు పర్చారు

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని  పోలీసులు ఇవాళ ఇబ్రహీంపట్నం కోర్టులో  హాజరు పర్చారు. నిన్ననే నవీన్ రెడ్డిని పోలీసులు గోవాలో అరెస్ట్  చేశారు.  డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకొనేందుకు నవీన్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు. రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. అయితే తన కోసం పోలీసులు గాలిస్తున్నారనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న  నవీన్ రెడ్డి  డాక్టర్ వైశాలిని  హైద్రాబాద్ కు పంపి   తాను తప్పించుకున్నాడు. అయితే  నవీన్ రెడ్డి  గోవాలో  ఉన్న సమయంలో నిన్న పోలీసులు అరెస్ట్  చేశారు.ఈ కేసులో అరెస్టైన  ఐదుగురు నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు  కస్టడీ పిటిషన్ ను దాఖలు చేశారు.  ఈ నెల  9వ తేదీన డాక్టర్ వైశాలికి మరో యువకుడితో నిశ్చాతార్ధం ఉంది.ఈ విషయం తెలుసుకుని నవీన్ రెడ్డి  డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !