హైద్రాబాద్ బాలాపూర్ లో ఓ వ్యక్తి కిడ్నాప్ డ్రామా ఆడాడు. లక్ష రూపాయాల కోసం ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్టుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: నగరంలోని బాలాపూర్ లో కిడ్నాప్ డ్రామా ఆడాడు రమేష్ అనే యువకుడు. ఈ డ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు. లక్ష రూపాయాల కోసం యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడినట్టుగా పోలీసులు తేల్చారు. కిడ్నాప్ డ్రామా ఆడిన రమేష్ ను పోలీసులు శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.
హైద్రాబాద్ బాలాపూర్ కు చెందిన రమేష్ లక్ష రూపాయాల కోసం కిడ్నాప్ డ్రామా ఆడారు. తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తండ్రికి వీడియో పంపాడు. కిడ్నాపర్లు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నాడు.
కిడ్నాపర్ల నుండి తనను కాపాడాలని కోరారు. కిడ్పాపర్లు కోరినట్టుగా డబ్బులు పంపాలని ఆ వీడియోలో సూచించారు.ఈ విషయమై రమేష్ పేరేంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.
రమేష్ సురక్షితంగా ఉన్నట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తిచారు. వెంటనే రమేష్ ఎక్కడ ఉన్నాడో గుర్తించి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష రూపాయాల కోసం ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఉప్పుగూడకు చెందిన రమేష్ పెద్దయ్య అనే వ్యక్తి నుండి లక్ష రూపాయాలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పును ఎగ్గొట్టేందుకు కిడ్నాప్ డ్రామా ఆడాడు. గుంటూరు జిల్లాకు వెళ్లి రమేష్ కిడ్నాప్ డ్రామాను నడిపాడు. కాళ్లు, చేతులు కట్టేసినట్టుగా ఉన్న ఫోటోలు , వీడియోలను తండ్రికి రమేష్ షేర్ చేశాడు. ఈ విషయమై పోలీసులకు రమేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. గుంటూరులో ఉన్న రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.