మహబూబ్‌నగర్ లో ఇంటర్ విద్యార్ధి సూసైడ్: కాలేజీ ముందు విద్యార్ధుల ఆందోళన

By narsimha lode  |  First Published Mar 3, 2023, 9:27 AM IST

తెలంగాణ రాష్ట్రంలో  మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య  చేసుకున్నాడు. మహబూబ్ నగర్ లోని  ప్రైవేట్ కాలేజీకి  చెందిన విద్యార్ధి  శివకుమార్ ఆత్మహత్య  చేసుకున్నాడు. 
 


మహబూబ్‌నగర్:  పట్టణంలోని మణికొండలోని  ఓ ప్రైవేట్ కాలేజీలో  ఇంటర్ చదువుతున్న  విద్యార్ధి శివకుర్ శుక్రవారంనాడు ఆ్మహత్య  చేసుకున్నాడు.  మరో పది రోజుల్లో  ఇంటర్ పరీక్షలు  ప్రారంభం కానున్నాయి. దీంతో  ఒత్తిడి తట్టుకోలేక  విద్యార్ధి  ఆత్మహత్య  చేసుకున్నట్టుగా  అనుమానిస్తున్నారు.  

శివకుమార్ ఆత్మహత్య  విషయం తెలుసుకున్న  విద్యార్ధి సంఘాలు   కాలేజీ ముందు  ఆందోళనకు దిగారు.హైద్రాబాద్ నార్సింగి  శ్రీచైతన్య కాలేజీ  విద్యార్ధి  సాత్విక్  ఆత్మహత్య ఘటన   మర్చిపోకముందే  మరో ఘటన  చోటు  చేసుకొంది.  వరుసగా  విద్యార్ధుల  ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.  

Latest Videos

undefined

ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రంలో  సగటున  350 మంది విద్యార్ధులు  ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు.   ఒత్తిడితో పాటు  ఇతరత్రా కారణాలు  ఇంటర్ విద్యార్ధుల  ఆత్మహత్యలకు  కారణంగా  మారుతున్నాయి.  ఇంటర్  లో  అత్యధిక మార్కులు  సాధించడం కోసం  ఒత్తిడి పెంచడం  విద్యార్ధుల  ఆత్మహత్యలకు  కారణంగా మారుతున్నాయనే  అభిప్రాయాలు కూడా లేకపోలేదు. 

also read:సాత్విక్ ఆత్మహత్య కేసు .. పోలీసుల అదుపులో ‘‘ఆ నలుగురు ’’

గత  20   రోజులుగా   తెలంగాణ రాష్ట్రంలో  ఐదుగురు విద్యార్ధులు  ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  ఇంటర్  లో  ర్యాంకుల  కోసం  ప్రైవేట్ కాలేజీలు  విద్యార్ధులపై ఒత్తిడులు  తీసుకువస్తున్నాయని  విద్యార్ధి సంఘాలు  ఆరోపణలు  చేస్తున్నాయి.  గతంలో  కూడా ఇదే  తరహ ఘటనలు  చోటు  చేసుకున్నాయి.   విద్యార్ధులు  ఆత్మహత్యలు  చేసుకున్న సమయంలోనే  అధికారులు   హడావుడి చేస్తున్నారనే   విమర్శలు  లేకపోలేదు.    విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోకుండా  ఉండేలా  చర్యలు తీసుకోవాలని  విద్యార్ధి సంఘాలు  కోరుతున్నాయి.  
 

click me!