రేపు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష: పోలీసుల అనుమతి నిరాకరణ

Published : Mar 16, 2022, 09:27 PM ISTUpdated : Mar 16, 2022, 10:22 PM IST
రేపు ఇందిరాపార్క్ వద్ద  బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష: పోలీసుల అనుమతి నిరాకరణ

సారాంశం

బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. రేపు బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.   

హైదరాబాద్:  రేపు ఇందిరా పార్క్ వద్ద BJP తల పెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు Police అనుమతిని నిరాకరించారు. అయితే పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ నుండి BJP MLA ల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఈ నెల 17వ తేదీన Indira Park వద్ద బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకొంది.

దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay మండిపడ్డారు. ఇందిరా పార్క్ వద్ద సీఎం ధర్నా చేస్తే ఒప్పు... బీజేపీ దీక్ష చేస్తే తప్పా అని సంజయ్ ప్రశ్నించారు.ఇదెక్కడి న్యాయం, ప్రజాస్వామ్యవాదులారా మౌనం వీడాలని ఆయన కోరారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల రోజున గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో  బీజేపీ సభ్యులు నినాదాలు చేయడంతో వారిని ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.

బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డుప‌డుతున్నారనే కారణంతో ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావును సస్పెండ్ చేశారు. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్  Pocharam Srinivas Reddy ప్ర‌క‌టించారు. స్పీకర్‌ జారీచేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టేసి సమావేశాలకు తమను అనుమతించేలా ఆదేశించాని బీజేపీ ఎమ్మెల్యేలు Etela Rajender , Raghnandan Rao , Rajasingh లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ  పిటిషన్‌ను  Telangana High court  కొట్టేసింది. అసెంబ్లీ స్పీకర్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది.  ఈ విషయమై హైకోర్టు  డివిజన్ బెంచ్ ను బీజేపీ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు.

ఈ విషయమై  సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు డివిజన్ చెంచ్ విచారించింది.  జస్టిస్ ఉజన్ బయల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోకపోవడంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని జ్యూడిషీయల్‌ రిజిస్ట్రార్‌ను హైకోర్టును ఆదేశించింది.

అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు చేరేలా చూడాలని రిజిస్ట్రార్ జనరల్, హైదరాబాద్‌ సీపీ స్వయంగా వెళ్లి నోటీసులు అందజేయాలని ఆదేశించింది. మరో వైపు ఎమ్మెల్యేలు చట్ట సభల్లోనే ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై  స్పీకర్ దే తుది నిర్ణయమని కూడా హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు కాపీతో స్పీకర్ వద్దకు ఈ నెల 15న వెళ్లారు సస్పెండైన ఎమ్మెల్యేలు. అయితే సభ తీసుకున్న నిర్నయమే తన నిర్ణయమని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో మార్పు లేదన్నారు. సభలోకి అనుమతించబోనని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు