హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా..?

Published : Feb 20, 2022, 12:08 PM IST
హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా..?

సారాంశం

హైదరాబాద్ నగరంలోని నాచారంలో (Nacharam) ఓ కానిస్టేబులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం రాజు తల్లిదండ్రులకు అతడు ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. రాత్రివేళ అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు తెలిపారు.  

హైదరాబాద్ నగరంలోని నాచారంలో ఓ కానిస్టేబులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. తేజావత్ రాజు (30) అనే వ్యక్తి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగం చెరువు తండాలో నివాసం ఉంటున్నాడు. అతడు మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో (Maheswaram police station) కానిస్టేబుల్‌గా విధులు నిర్వరిస్తున్నారు. అతడు 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. శనివారం పోలీస్ స్టేషన్‌లో విధులు ముగించుకున్న రాజు.. ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆదివారం ఉదయం రాజు తల్లిదండ్రులకు అతడు ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. రాత్రివేళ Tejavath Raju ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని నాచారం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు తన దూరపు బంధువుల్లో ఒక యువతి(23) సంబంధం కలిగి ఉన్నాడు. అయితే విభేదాల కారణంగా వారు 2018లో విడిపోయాడు. విడిపోయిన వీరిద్దరి వేర్వేరు వ్యక్తులతో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ నిశ్చితార్థం తర్వాత.. వారికి కాబయే భాగస్వాములకు.. రాజు, యువతికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుని వివాహ ప్రతిపాదనలను విరమించుకున్నారు.

ఆ తర్వాత రాజు 2020 పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు రాజుకు యువతికి మధ్య రాజీ కుదిరింది. దీంతో వారిద్దరు బంధాన్ని తిరిగి ప్రారంభించారు. పెళ్లి కూడా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత వేరే ఇంటికి మారాలని యువతి రాజుపై ఒత్తిడి తెచ్చింది. అయితే రాజు మాత్రం  సింగం చెరువు తండాలో ఉంటున్న తన తల్లిదండ్రులు వదిలి వేరే ఇంటికి మారాలనే ఆలోచనను వ్యతిరేకించాడు. మరోవైపు వేరే ఇంటికి మారకుంటే పెళ్లి చేసుకోనని యువతి రాజుకు తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే రాజు.. యువతిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. 

దీంతో రాజు మనస్తాపానికి గురయ్యాడు. డిప్రెషన్‌లోకి జారి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. సెక్షన్ 174 CrPC కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

(Disclamir: ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు. సంక్షోభం వంటి పరిస్థితులు ఎదురైతే, అలాంటి భావన కలిగితే.. మీరు కౌన్సెలింగ్ మద్దతు కోసం ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలకు కాల్ చేయవచ్చు. ఈ నెంబర్‌లు పూర్తిగా పబ్లిక్ డొమైన్‌ నుంచి సేకరించబడినవి.. వీటిని Asianet Telugu ధ్రువీకరించలేదు)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్