ఏటీఎం‌లో డబ్బులు నింపేందుకు లోనికి వెళ్లిన సిబ్బంది.. రూ. 36 లక్షలతో పరారైన వాహనం డ్రైవర్

Published : Feb 20, 2022, 11:27 AM IST
ఏటీఎం‌లో డబ్బులు నింపేందుకు లోనికి వెళ్లిన సిబ్బంది.. రూ. 36 లక్షలతో పరారైన వాహనం డ్రైవర్

సారాంశం

ఏటీఎంల వద్దకు డబ్బులు తీసుకొచ్చే వాహనానికి డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి... రూ. 36 లక్షలతో పరారయ్యాడు. సమయం చూసిన డ్రైవర్.. వాహనంతో పాటు పరారయ్యాడు. ఈ ఘటన Hyderabad దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సూరారం సాయిబాబానగర్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. 

ఏటీఎంల వద్దకు డబ్బులు తీసుకొచ్చే వాహనానికి డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి... రూ. 36 లక్షలతో పరారయ్యాడు. సమయం చూసిన డ్రైవర్.. వాహనంతో పాటు పరారయ్యాడు. ఈ ఘటన Hyderabad దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సూరారం సాయిబాబానగర్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వివరాలు.. ఏటీఎం పాయింట్‌లో డబ్బులు నింపేందుకు శనివారం రైటర్‌సంస్ధకు చెందిన వాహనంలో రూ. 64 లక్షల నగదుతో కస్టోడియన్లు, నితిన్, రంజిత్, గన్‌మెన్ బాబు, డ్రైవర్ సాగర్‌లు బయలుదేరారు. 

వారు తొలుతు జీడిమెట్లలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో రూ. 13 లక్షల డబ్బులు నిపారు. అనంతరం సూరారం కాలనీలోని సాయిబాబా నగర్‌లోని మరో యాక్సిస్ బ్యాంక్‌ ఏటీఎం పాయింట్‌లో రూ. 15 లక్షల నింపడానికి వచ్చారు. రూ. 15 లక్షలు తీసుకుని ఇద్దరు కస్టోడియన్లు లోనికి వెళ్లారు. గన్‌మెన్ బాబు బయట సెక్యూరిటీగా ఉన్నాడు. 

అయితే ఆ సమయంలో వాహనాన్ని యూటర్న్ చేసుకోస్తానని చెప్పిన సాగర్.. అక్కడి నుంచి వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అయితే సాగర్ ఎంతసేపటికి రాకపోవడంతో అతనికి ఫోన్ చేయగా స్బిచ్చాఫ్ వచ్చింది. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సాగర్ కోసం గాలింపు చేపట్టారు. సారగ్ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపూర్ అటవీ ప్రాంతంలో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. వాహనంలో డబ్బు కనిపించలేదు. సాగర్ డబ్బుతో పరారైనట్టుగా తెలుస్తోంది. 

ఇక, వాహనంలో ఉన్న గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సాగర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సాగర్ కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడి ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు