చదువు కోసం వచ్చి,గంజాయి సాగు చేస్తూ...

By Nagaraju TFirst Published Oct 18, 2018, 11:00 AM IST
Highlights

చదువుపేరుతో హైదరాబాద్ వచ్చిన కొందరు నైజీరియా యువత గంజాయి మెుక్కలను సాగు చేస్తూ కటకటాలపాలయ్యారు. మత్తు మందు సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కేటుగాళ్లు అడ్డదారులు దొక్కుతున్నారు. గంజాయిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం కష్టమని భావించిన కొందరు నైజీరియా యువత ఏకంగా తాముండే ఇంటిపైనే గంజాయి మొక్కల సాగు చేపట్టారు. 

హైదరాబాద్: చదువుపేరుతో హైదరాబాద్ వచ్చిన కొందరు నైజీరియా యువత గంజాయి మెుక్కలను సాగు చేస్తూ కటకటాలపాలయ్యారు. మత్తు మందు సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కేటుగాళ్లు అడ్డదారులు దొక్కుతున్నారు. గంజాయిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం కష్టమని భావించిన కొందరు నైజీరియా యువత ఏకంగా తాముండే ఇంటిపైనే గంజాయి మొక్కల సాగు చేపట్టారు. 

వివరాల్లోకి వెళ్తే కాప్రాలో ఓ ఇంటిలో నలుగురు నైజీరియా యువత నివాసం ఉంటున్నారు. మత్తుకు బానిసలైన వారు గంజాయి ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం కష్టంగా భావించారు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా తాము అద్దెకు ఉంటున్న ఇంటిపైనే గంజాయి మెుక్కలను పెంచడం ప్రారంభించారు. పూలతొట్టెలో గంజాయి మొక్కలను పెంచుతున్నారు. 

అప్పుడప్పుడు గంజాయి సేవిస్తుండటంతో ఇరుగుపొరుగు వారు గమనించారు. అనుమానం వచ్చి చూస్తే గంజాయి సాగు చేస్తున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నైజీరియన్స్ ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. ఓ యువతి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు గోడ దూకి పరారయ్యారు. 

సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదువు పేరుతో కొందరు నైజీరియా యువత నగరానికి వచ్చి మత్తు మందు సరఫరా చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఎంత హెచ్చరించినా మార్పు రావడం లేదన్నారు. గంజాయి మొక్కలను ఎవరు పెంచినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

click me!