మేనల్లుడని చేరదీస్తే.. కామంతో..

Published : Oct 18, 2018, 10:52 AM IST
మేనల్లుడని చేరదీస్తే.. కామంతో..

సారాంశం

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మారితే.. మేనల్లుడే కదా అని చేరతీశాడు.

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మారితే.. మేనల్లుడే కదా అని చేరతీశాడు. చివరికి ఆ మేనల్లుడే.. కామంతో.. మరదలిని కాటేశాడు. ఈ దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామానికి చెందిన యువకుడికి (22) చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో అనాథగా మిగలగా అతడిని మేనమామ రామాపురం తీసుకెళ్లి పెంచి పెద్ద చేసి పెళ్లిచేశాడు. తాను చేసే పనిలోనే పెట్టుకుని పోషిస్తున్నాడు.
 
ప్రస్తుతం ఇరువురూ పక్కపక్క ఇళ్లలోనే కిరాయికి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు మొబైల్‌ ఫోన్‌లో మేనమామ కూతురైన ఎనిమిదేళ్ల చిన్నారికి పోర్న్‌ వీడియోలు చూపిస్తూ, రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సర్దార్‌నాయక్‌ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు