మైక్రో ఫైనాన్స్ యాప్స్ కేసు: ఇద్దరిని అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

By narsimha lode  |  First Published Dec 21, 2020, 9:52 PM IST

మైక్రోఫైనాన్స్ యాప్స్ సంస్థలపై అందిన ఫిర్యాదుల ఆధారంగా  పిన్ ప్రింట్ టెక్నాలజీ  ప్రతినిధులను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.


హైదరాబాద్: మైక్రోఫైనాన్స్ యాప్స్ సంస్థలపై అందిన ఫిర్యాదుల ఆధారంగా  పిన్ ప్రింట్ టెక్నాలజీ  ప్రతినిధులను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పిన్ ప్రింట్ టెక్నాలజీ మేనేజర్ మధు, అసిస్టెంట్ మేనేజర్ మనోజ్ లను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థలో హెచ్ఆర్ వ్యవహరాలు చూస్తున్న శ్రీనిధి, అడ్మిన్ వ్యవహరాలను చూస్తున్న మహేష్ లను కూడ పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారు.

Latest Videos

also read:మైక్రో ఫైనాన్స్ యాప్స్ గుట్టురట్టు: సైబరాబాద్ పోలీసుల దాడులు, కేంద్రం ఇదీ..

మైక్రో ఫైనాన్స్ యాప్స్ సంస్థలు రుణాలిచ్చి పలువురిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సంస్థల  ప్రతినిధుల వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలు పాల్పడ్డారు.

ఈ యాప్స్ సంస్థల బాధితులు పోలీసులకు పలు ఫిర్యాదులు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. గురుగ్రామ్ తో పాటు హైద్రాబాద్ నగరంలోని పంజగుట్ట, బేగంపేటలోని యాప్ సంస్థల కార్యాలయాలపై దాడులు నిర్వహించాయి.

ఆదివారం నాడు ఒక్క రోజునే యాప్స్ ఆగడాలపై సుమారు 100కిపైగా  కేసులు నమోదయ్యాయి. యాప్స్ సంస్థల వేధింపులు భరించలేక తెలంగాణలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వేధింపులు భరించలేక కేసులు నమోదయ్యాయి.
 

click me!