వ్యాపారవేత్తల బ్లాక్ మెయిల్: హైద్రాబాద్ లో ముగ్గురి అరెస్ట్

Published : May 26, 2023, 03:44 PM IST
 వ్యాపారవేత్తల  బ్లాక్ మెయిల్: హైద్రాబాద్ లో  ముగ్గురి అరెస్ట్

సారాంశం

ప్రముఖ వ్యాపారవేత్తలను లక్ష్యంగా  చేసుకొని  బ్లాక్ మెయిల్ కు  పాల్పడుతున్న ముఠాను  హైద్రాబాద్  పోలీసులు   అరెస్ట్  చేశారు. 

హైదరాబాద్:   హైద్రాబాద్ లో  ప్రముఖ వ్యాపార వేత్తలను లక్ష్యంగా  చేసుకని  వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల  ముఠాను  మల్కాజిగిరి  ఎస్ఓటీ  పోలీసులు  శుక్రవారంనాడు  అరెస్ట్  చేశారు.

అమెరికాలో  ఉద్యోగం  చేసి హైద్రాబాద్ కు వచ్చిన  ప్రదీప్ అనే వ్యక్తి ఈ ముఠాకు  నాయకుడిగా  పోలీసులు గుర్తించారు.   ప్రదీప్ టెక్కీగా  పనిచేస్తున్నాడు.  సులభంగా  డబ్బులు సాధించాలనే   ఉద్దేశ్యంతో  వ్యాపారులను లక్ష్యంగా  చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా  పోలీసులు గుర్తించారు.  హైద్రాబాద్ లోని ఓ  స్కూల్  యజమానిని  ఈ ముఠా  రూ. 25 లక్షలు   ఇవ్వాలని డిమాండ్  చేసిందని  పోలీసులు గుర్తించారు.  స ఇదే  రకంగా  పలువురు వ్యాపారవేత్తలను కూడ నిందితులు  డబ్బులు డిమాండ్  చేశారని పోలీసులు చెబుతున్నారు.

ఈ విషయమై  పోలీసులకు అందిన సమాచారం  మేరకు   ఈ ముఠా సభ్యులను  పోలీసులు  అరెస్ట్ చేశారు.ఈ ముఠాలో ప్రదీప్, శ్రీకాంత్, రాజేష్లు సభ్యులుగా  ఉన్నారని  పోలీసులు చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu