సోషల్ మీడియాలో యువకుల ట్రాప్, మోసం: యువతి, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

By narsimha lode  |  First Published Dec 18, 2022, 10:24 AM IST

ప్రేమ, పెళ్లి పేరుతో  యువకులను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న  తనుశ్రీతో పాటు  ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్  చేశారు.


హైదరాబాద్: ప్రేమ పెళ్లి పేరుతో  యువకులను ట్రాప్  చేసి డబ్బులు వసూలు చేస్తున్న  తనుశ్రీ అనే యువతితో పాటు  ఆమె ప్రియుడిని  హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్  చేశారు.సోషల్ మీడియాలో  యువకులను యువతి  ట్రాప్ చేస్తుంది. ప్రేమ, పెళ్లి పేరుతో  యువకుల నుండి  డబ్బులు వసూలు చేస్తుంది.  అందంగా  ముస్తాబై ఇన్‌స్టాగ్రామ్,  ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా అకౌంట్లలో  తన ఫోటోలను  యువతి  షేర్ చేస్తుంది.ఈ ఫోటోలకు   లైక్ లు, కామెంట్ చేసిన యువకులను  లక్ష్యంగా  చేసుకుంటుంది  యువతి.  ప్రేమ, పెళ్లి పేరుతో వారిని ట్రాప్ చేస్తుంది.  

యువకుల నుండి డబ్బులు వసూలు చేస్తుంది.  ఈ కిలాడీ లేడీ ట్రాప్ లో  హైద్రాబాద్ కు చెందిన  యువకుడు పడ్డాడు.  అతడి నుండి  రూ. 31 లక్షలు వసూలు చేసింది.  చివరకు తాను మోస పోయినట్టుగా  గుర్తించిన యువకుడు  హైద్రాబాద్ సీసీఎస్  పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  దర్యాప్తు నిర్వహించారు.  సోషల్  మీడియాలో  యువతను  ట్రాప్ చేస్తున్న యువతిని తనుశ్రీగా గుర్తించారు.  తనుశ్రీతో పాటు ఆమెకు సహకరిస్తున్న  ప్రియుడు శ్రీకాంత్ ను పోలీసులు ఇవాళ అరెస్ట్  చేశారు.హైద్రాబాద్ నగరంలోనే  నాలుగు కేసులు నమోదయ్యాయి.  మోసపోయిన  ఓ టెక్కీ  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  ఈ విషయం  వెలుగులోకి వచ్చింది.  తనుశ్రీ ఎవరెవరిని  మోసం చేసిందనే  విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 
 

Latest Videos

click me!