
హైదరాబాద్: కర్ణంగూడ కాల్పుల ఘటనకు సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భూ వివాదాలే ఈ హత్యలకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. అయితే సుఫారీ ఇచ్చి ఈ హత్యలు చేశారా లేదా ఇతరులు ఎవరైనా ఉన్నారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నానికి సమీపంలోని Karnamguda వద్ద మంగళవారం నాడు ఉదయం రియల్ ఏస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, Raghavender Reddyలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా రాఘవేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
Srinivas Reddy ని షాట్ వెపన్ తో రాఘవేందర్ రెడ్డినిPistolతో కాల్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలోనే పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకొన్నారు.
శ్రీనివాస్ రెడ్డిని పాయింట్ బ్లాంక్ లో షాట్ వెపన్ తో కాల్చారు. రాఘవేందర్ రెడ్డిపై ఛాతీలో కాల్పలకు దిగినట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల కాల్ డేటాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో Matta Reddyతో పాటు శ్రీనివాస్ రెడ్డి వద్ద పనిచేస్తున్న హఫీజ్, కృష్ణలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ఈ స్థలం నుండి తిరిగి వెళ్లే సమయంలో దుండగులు కాల్పులకు దిగారు. అయితే ఈ సమయంలో కారు నడుపుతున్న రాఘవేందర్ రెడ్డికి గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో శ్రీనివాస్ రెడ్డి కారు దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు.
అయితే శ్రీనిాస్ రెడ్డికి గతంలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ఆయన ఎక్కువ దూరం పరుగెత్తలేకపోయాడు. సమీపంలోని పొదల్లోనే శ్రీనివాస్ రెడ్డిని దుండగులు పట్టుకొన్నారు. శ్రీనివాస్ రెడ్డిపై షాట్ వెపన్ తో దుండగులు కాల్పి చంపారు. మరో వైపు కారులో ఉన్న రాఘవేందర్ రెడ్డి కారును రోడ్డు వరకు తీసుకెళ్లాడు.
కానీ అక్కడి నుండి ఆయన కారును నడపలేకపోయాడు. వెంటనే కృష్ణ, హఫీజ్ లకు రాఘవేందర్ రెడ్డి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఆధారంగా కృష్ణ, హఫీజ్ లు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో మట్టారెడ్డి కూడా ఉన్నారు. ఈ విషయమై హఫీజ్, కృష్ణలు మట్టారెడ్డిని నిలదీశారు.
మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డికి మధ్య విబేధాలున్నాయి. ఈ విషయమై మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సంఘటన స్థలానికి వచ్చిన కృష్ణ, హఫీజ్ లను కూడా పొలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
సోమవారం నాడే మట్టారెడ్డిని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించినట్టుగా సమాచారం. శ్రీనివాస్ రెడ్డి కోనుగోలు చేసిన భూమి విషయమై ఇతర ప్లాట్ల యజమానులను మట్టారెడ్డి రెచ్చగొడుతున్నారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారని శ్రీనివాస్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇవాళ ఉదయమే శ్రీనివాస్ రెడ్డితో పాటు రాఘవేందర్ రెడ్డిపై కాల్పులు జరిగాయి. శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రాఘవేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
మూడు మాసాల క్రితమే 10 ఎకరాల భూమిని శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కొనుగోలు చేశారు. ప్రతి రోజూ శ్రీనివాస్ రెడ్డి, ఈ ప్రాంతానికి వచ్చేవారు. తాను కొనుగోలు చేసిన భూమిలో వాకింగ్ చేసి తిరిగి వెళ్లేవాడు. అయితే ఇవాళ ఉదయం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలతో మట్టారెడ్డి ఇవాళ గొడవకు దిగారని చెబుతున్నారు. ఆ తర్వాతే కాల్పుుల జరిగాయని సమాచారం. ఈ విషయమై మట్టారెడ్డి అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు అల్మాస్ గూడకు చెందినవారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలతో మాట్లాడుదామని పిలిపించి దుండగులు చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యర్ధులు దాడి చేసే రాఘవేందర్ రెడ్డి తప్పించుకొనేందుకు అక్కడి నుండి పారిపోయాడు. అయితే రాఘవేందర్ రెడ్డిపై ప్రత్యర్ధులు కాల్పులకు దిగారు. శ్రీనివాస్ రెడ్డిని దుండగులు కొట్టి చంపారు.