
హైదరాబాద్: Hyderabad నగరంలోని Niloufer ఆసుపత్రిలో బుధవారం నాడు ఉదయం ఇద్దరు చిన్నారులు మరణించారు. Nurse ఇచ్చిన Injection వల్లే చిన్నారులు మరణించారని మృతులు Parentsఆందోళనకు దిగారు. చిన్నారులను Hospitalకి తీసుకొచ్చే సమయానికి వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ నర్స్ ఇచ్చిన ఇంజక్షన్ వల్లే పిల్లలు మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బందితో మృతుల కుటుంబసభ్యులు వాగ్వావాదానికి దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకొంది.
నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన నాలుగు రోజుల శిశువుకు ఊపిరితిత్తులు సరిగా వృద్ధి చెందకపోవడంతో తల్లిదండ్రులు నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. గత రెండు రోజులుగా పాప కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇవాళ ఉదయం ఈ పాపతో పాటు మరో చిన్నారికి నర్స్ ఇంజక్షన్లు ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చింది. అయితే ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో ఇంజక్షన్ ఇవ్వడం వల్లే పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.