క్యూఆర్‌కోడ్‌ పంపి డబ్బుల స్వాహా: ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 8, 2021, 4:56 PM IST
Highlights

టెక్నాలజీని ఉపయోగించుకొని మోసం చేస్తున్న భరత్ పూర్, అల్వార్ గ్యాంగ్ లకు చెందిన ఏడుగురిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు ఈ గ్యాంగ్ లపై నమోదయ్యాయి.లక్షలాది రూపాయాలను ప్రజలు కోల్పోయారు. ఓఎల్‌ఎక్స్ లో వస్తువులను కొనుగోలు చేసే పేరుతో నిందితులు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు.
 


హైదరాబాద్:ఓఎల్ఎక్స్ లో  వస్తువుల క్రయ విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్ లోని భరత్ పూర్, అల్వార్ గ్యాంగ్ లకు చెందిన ఏడుగురిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.  ఈ రెండు గ్యాంగ్ లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురిని మోసం చేశారు.

 రాజస్థాన్ కు చెందిన భరత్ పూర్, అల్వార్ గ్యాంగ్‌లపై రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.  అయితే పోలీసులకు చిక్కకుండా నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ గ్యాంగ్ లకు చెందిన ఏడుగురిని  పోలీసులు అరెస్ట్ చేసి హైద్రాబాద్ కు తీసుకొచ్చారు.

ఓఎల్‌ఎక్స్ లో ప్రతి వస్తువును కొనుగోళ్లు చేస్తామని  వినియోగదారుల మాదిరిగా నిందితులు ఫోన్ చేస్తారు. నిందితులు డబ్బులు పంపే పేరుతో క్యూ ఆర్ కోడ్ పంపుతారు. ఈ కోడ్ నుస్కాన్ చేయాలని కోరుతారు.ఈ కోడ్ ను స్కాన్ చేయగానే  స్కాన్ చేసిన వ్యక్తి ఖాతాల నుండి డబ్బులు మాయమౌతాయి.  డబ్బులు తమ ఖాతాల్లో జమ కాగానే నిందితులు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తారు.ఈ విషయమై నమోదైన కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

click me!