ఇది మహాయజ్జం.. అమ్మ ఆశీర్వదం, నాన్న దీవెనలతో విజయం మనదే : వైఎస్ షర్మిల

Published : Jul 08, 2021, 04:33 PM IST
ఇది మహాయజ్జం.. అమ్మ ఆశీర్వదం, నాన్న దీవెనలతో విజయం మనదే : వైఎస్ షర్మిల

సారాంశం

పార్టీ పెట్టడం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేయబోయే మహాయజ్ఞం..  "అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది... నాన్న పైనుంచి దీవిస్తున్నాడు... వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం" అని షర్మిల అన్నారు. 

ఇవాళ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కూడా పాల్గొన్నారు. ఇక అసలు విషయానికొస్తే, షర్మిల నేడు తెలంగాణలో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. 

ఈ పార్టీకి తండ్రి పేరు మీదుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని నామకరణం చేయడం తెలిసిందే. ఈ మధ్యాహ్నం ఆమె ఇడుపులపాయ నుంచి హైదరాబాదు చేరుకుని పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొంటారు. దీనిపై షర్మిల ట్విట్టర్ లో తన మనోభావాలను పంచుకున్నారు.

ఇది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేయబోయే మహాయజ్ఞం అని అభివర్ణించారు. "అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది... నాన్న పైనుంచి దీవిస్తున్నాడు... వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం" అని షర్మిల ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే