పరారీలో ఉన్న సల్మాన్ ను హైద్రాబాద్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన సమయలో సల్మాన్ తప్పించుకుపోయాడు.
హైద్రాబాద్: పరారీలో ఉన్న సల్మాన్ ను హైద్రాబాద్ పోలీసులు బుధవారంనాడు అరెస్ట్ చేశారు. ఉగ్రమూలాలపై మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ను మంగళవారంనాడు నిర్వహించారు. హైద్రాబాద్ లో మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. సల్మాన్ పరారీలో ఉన్నారు. ఇవాళమ మధ్యాహ్నం సల్మాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ సల్మాన్ అరెస్ట్ తో మొత్తం ఈ కేసులో అరెస్టౌన వారి సంఖ్య 17కి చేరుకుంది.ఈ 17 మందిలో మొత్తం 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మిగిలిన ఆరుగురు హైద్రాబాద్ కు చెందినవారు. హైద్రాబాద్ కు చెందినవారిలో ఆరుగురిలో ఉన్నత విద్యావంతులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో ముగ్గురు మారు పేర్లతో నివసిస్తున్నట్టుగా కూడ పోలీసులు గుర్తించారు.
also read:ఉగ్ర మూలాలపై హైద్రాబాద్ లో ఏటీఎస్ తనిఖీల్లో కీలక విషయాలు: మారుపేర్లతో నివాసం, విధ్వంసానికి ప్లాన్
ఈ 17 మంది నగరంలో 18 మాసాలుగా ఉంటున్నారు. హిజ్బ్ ఉత్ తహరీక్ అనే సంస్థతో వీరికి సంబంధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు వీరు ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 16 మందిని ఏటీఎస్ టీమ్ నిన్న భోపాల్ తరలించింది. ఇవాళ అరెస్ట్ చేసిన సల్మాన్ ను కూడా భోపాల్ తరలించనున్నారు.