
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మంగళవారం నాడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. గో రక్షా పేరిట గోవులను రక్షిస్తుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ బషీర్‌బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు నిరహారదీక్ష చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో సోమవారం సాయంత్రం నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. మంగళవారంనాడు ఉదయం బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ ఆఫీస్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ బయలుదేరుతుండగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
గోవులను రక్షించి గోశాలకు తరలిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గోరక్ష కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గోవులను చంపేందుకు పిలిపించిన కసాయిలను గుర్తించి కేసులను పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే దీక్ష చేస్తానని రాజాసింగ్ హెచ్చరించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వార్త చదవండి
కారణమిదే: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా