వేములవాడ రాజన్న దర్శనానికి క్యూ లైన్లో నిలుచున్న ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఆలయంలో విషాదం చోటు చేసుకుంది.
వేములవాడ : తెలంగాణ లోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. దర్శనం కోసం క్యూ లైన్లో నిలుచున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో
లక్ష్మి అనే ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది మృతి చెందినట్లుగా తెలిపారు.
లక్ష్మి కరీంనగర్ జిల్లా లింగాపూర్ నివాసి. కుటుంబంతో కలిసి రాజన్న దర్శనానికి వేములవాడకు వచ్చారు. సోమవారమే వీరు వేములవాడకు వచ్చారు. మంగళవారం ఉదయం దర్శనం కోసం రాగా.. క్యూ లైన్లో నిలుచున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.