హైద్రాబాద్‌లో మహిళా ఐఎఎస్ అధికారి ఇంట్లోకి వెళ్లిన డిప్యూటీ తహసీల్దార్: అరెస్ట్ చేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Jan 22, 2023, 9:39 AM IST
Highlights

హైద్రాబాద్  జూబ్లీహిల్స్ లోని గేటేడ్ కమ్యూనిటీ  విల్లాలో  నివాసం ఉటున్న  సీనియర్ ఐఎఎస్  అధికారిణి  వివాసంలోకి  డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి ప్రవేశించారు.  ఆనంద్ కుమార్ రెడ్డి ని జూబ్లీహిల్స్ పోలీసులు  అరెస్ట్  చేశారు. 

హైదరాబాద్:'సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి ఇంటికి అర్ధరాత్రి పూట వెళ్లిన    మేడ్చల్  జిల్లాకు  చెందిన డిప్యూటీ తహసీల్దార్  ఆనంద్ కుమార్ రెడ్డిని  పోలీసులు  అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు.  ఈ విషయమై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో  సీనియర్ ఐఎఎస్  అధికారి   నివాసం ఉంటున్నారు.  ఇదే కాలనీలో  ఐపీఎస్ అధికారులు  కూడా నివాసం ఉంటున్నారు.  రెండు రోజుల క్రితం   అర్ధరాత్రి  మహిళా ఐఎఎస్ అధికారిణి నివాసంలోకి అపరిచిత వ్యక్తి  వచ్చాడు. తన ఇంట్లోకి అపరిచిత వ్యక్తి రావడంతో  సీనియర్ ఐఎఎస్ అధికారి  షాక్ కు గురయ్యారు.  మీరెవరని  ఆమె ప్రశ్నించారు. అయితే తాను  డిప్యూటీ తహసీల్దార్ అంటూ  అతను సమాధానం చెప్పాడు. తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే విషయంలో  ఇబ్బందులున్నాయని   అతను సమాధానం ఇచ్చారు. ఈ విషయమై మాట్లాడేందుకు  వచ్చినట్టుగా  చెప్పాడు.ఈ మాటలు విన్న సీనియర్ ఐఎఎస్అధికారి  ఖంగుతిన్నాురు. వెంటనే  ఆమె  అతనిపై  మండిపడ్డారు.గట్టిగా  అరిచారు.  దీంతో  అక్కడే విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరకున్నారు.  ఆనంద్ కుమార్ రెడ్డిని  స్థానిక పోలీసులకు భధ్రతా సిబ్బంది అప్పగించారు. ఈ విషయమై  జూబ్లీహిల్స్ పోలీసులు ఆనంద్ కుమార్ రెడ్డిని  అరెస్ట్  చేశారు.  రిమాండ్ కు తరలించారు 

ఆనంద్ కుమార్ రెడ్డి  సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి  నివాసానికి ఎందుకు వచ్చారనే  విషయమై  ఆరా తీస్తున్నారు. ఉద్యోగం విషయంలో ఇబ్బందులుంటే  పని వేళల్లో కార్యాలయంలో  కలవాల్సి ఉంటుంది. కానీ  మహిళా ఐఎఎస్ అధికారి  నివాసానికి  అర్ధరాత్రి  పూట ఆనంద్ కుమార్ రెడ్డి ఎందుకు  వచ్చారనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  

also read:అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి డిప్యూటీ తహసీల్దార్... వెళ్లింది అందుకేనా...?

గతంలో  సీనియర్ ఐఎఎస్ అధికారి  సోషల్ మీడియాలో  పోస్ట్  చేసిన   పోస్టులను  ఆనంద్ కుమార్  రీట్వీట్  చేశారు.  సీనియర్ ఐఎఎస్ అధికారి సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తాను రీట్వీట్  చేసిన విషయాన్ని కూడా ఆనంద్ కుమార్ రెడ్డి  గుర్తు  చేస్తున్నారు.

అక్రమ చొరబాటు, న్యూసెన్స్ కింద  పోలీసులు   డిప్యూటీ తహసీల్దార్  ఆనంద్ కుమారెడ్డి పై కేసు నమోదు  చేశారు. ఆనంద్ కుమార్  రెడ్డితో  పాటు  అతని డ్రైవర్ ను కూడా పోలీసులు అరెస్ట్  చేశారు.   వీరిద్దరిని  పోలీసులు   మేజిస్ట్రేట్  ముందు  హాజరుపర్చారు. మేజిస్ట్రేట్  నిందితులకు  14 రోజుల  పాటు  రిమాండ్  విధించారు.  


 


 


 

click me!