ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు.. 500 మంది యువతులను మోసం చేసిన వంశీకృష్ణ అరెస్ట్

Published : May 09, 2022, 02:35 PM ISTUpdated : May 09, 2022, 02:36 PM IST
ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు..  500 మంది యువతులను మోసం చేసిన వంశీకృష్ణ అరెస్ట్

సారాంశం

ఉద్యోగాల పేరుతో యువతులను మోసం  చేస్తున్న వంశీకృష్ణ అనే వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీకృష్ణ దాదాపు 500 మంది యువతులను మోసం చేసినట్టుగా తెలుస్తోంది.

ఉద్యోగాల పేరుతో యువతులను మోసం  చేస్తున్న వంశీకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీకృష్ణ దాదాపు 500 మంది యువతులను మోసం చేసినట్టుగా తెలుస్తోంది. వంశీకృష్ణపై ఏపీ, తెలంగాణలో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. వితంతువులు, విడాకులు పొందిన మహిళలే టార్గెట్‌గా వంశీకృష్ణ మోసాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. వంశీకృష్ణ.. గొంతుమార్చి యువతులను మోసం చేసేవాడు.  స్కీంల పేరుతో ప్రజాప్రతినిధులను సైతం మోసం చేశాడు. ఇలా ఇప్పటివరకు రూ. 5 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.  

ఇలా వచ్చిన డబ్బులను వంశీకృష్ణ బెట్టింగ్, గుర్పు పందాలలో పెట్టేవాడు. వరుస మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణను తాజాగా హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?