ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ కు చోటు...

By SumaBala BukkaFirst Published Jun 8, 2023, 6:47 AM IST
Highlights

మెర్సర్స్ ప్రకారం, 2023లో సర్వే చేయబడిన అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ 202వ స్థానంలో నిలిచింది. 

ఢిల్లీ : విదేశీయులకు భారత్ లో అత్యంత ఖరీదైన నగరాల  జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కింది. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. ముంబై తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా చెన్నై,  బెంగళూరు, కోల్ కతా, పూణె ఉన్నాయి. మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ఈ విషయాన్ని చెబుతుంది. 

ఈ సర్వే ఐదు ఖండాల్లోని 227 నగరాల్లో జరిపారు. ప్రతి నగరంలోనూ నివాసానికయ్యే ఖర్చు, ఆహార ఖర్చు, దుస్తులు, గృహోపకరణాలు,  వినోదం లాంటి దాదాపు 200 వరకు అంశాలకు.. ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు.  దాన్నిబట్టి ఈ జాబితాను రూపొందిస్తారు.

వేములవాడలో లా స్టూడెంట్ అరెస్ట్ .. పీడీఎస్‌యూ పూర్వ విద్యార్ధుల సంఘం ఆగ్రహం

ఈ సర్వేలోని ముఖ్యాంశాలు ఇవే..
దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై ప్రపంచంలోనే ఖరీదైన నగరాల్లో 147వ స్థానంలో నిలిచింది. ఇక ఢిల్లీ 169వ స్థానంలో ఉండగా..184వ స్థానంలో చెన్నై, 189వ స్థానంలో బెంగళూరు, 202వ స్థానంలో హైదరాబాదు, 21 వస్థానంలో కోల్కత్తా, 213వ స్థానంలో పూణేలు ఉన్నాయి.

ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో హాంకాంగ్, సింగపూర్, జూరిచ్ లు ఉన్నాయి. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో ఈ ఏడు 83 స్థానాలు కోల్పోయి హవానా నిలిచింది. ఇక ఈ జాబితాలు తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో కరాచీ, ఇస్లామాబాద్ లు కూడా ఉన్నాయి.

చెన్నై, హైదరాబాద్, కోల్కతా, పూణేల్లో.. ముంబైతో పోల్చితే వసతి సౌకర్యాల ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయి. ఇక కోల్కతాలో అయితే విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చే వారికి అత్యంత తక్కువ వసతి ఖర్చులు ఉన్నాయి.

అంతర్జాతీయ ర్యాంకింగ్ లు...  కరెన్సీ ఊగిసలాటలు, ఐరోపావంటి ప్రాంతాల్లో వస్తువులు, సేవల ధరల్లో మార్పులు పరిగణలోకి తీసుకొని.. ఈ కారణంగా భారత నగరాల స్థానాల్లో మార్పులు కనిపించాయి.

ఎమ్మెన్సీలకు ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో షాంగై, బీజింగ్, టోక్యో లతో పోలిస్తే ముంబై, ఢిల్లీ..  ఖర్చులపరంగా.. మంచి గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. ఈ కారణంగానే విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాలనుకునే బహుళ జాతి కంపెనీల మొదటి ఛాయిస్ ముంబై, ఢిల్లీలుగా నిలుస్తున్నాయి.

ఇక ఆసియా ప్రాంతానికి వస్తే.. ఈ ప్రాంతంలోని అత్యంత ఖరీదైన అగ్రగామి నగరాలు 35 ఉన్నాయి. వీటిల్లో ముంబై, ఢిల్లీలు ఉన్నాయి.  అత్యంత ఖరీదైన ఆసియా నగరాల్లో ముంబై స్థానం  నిరుడుతో పోలిస్తే ఒక స్థానం తగ్గింది. ప్రస్తుతం 27వ స్థానంలో ఉంది. 

click me!