కలబురిగీలో కరోనాతో మరణించిన 76 ఏళ్ల వ్యక్తితో సంభాషించిన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు చెందిన నర్సును హైదరాబాద్ అధికారులు నిర్బంధించారు.
మంగళవారం కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించిన నేపథ్యంలోని భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీనికి తోడు దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించాయి.
ఈ క్రమంలో కలబురిగీలో కరోనాతో మరణించిన 76 ఏళ్ల వ్యక్తితో సంభాషించిన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు చెందిన నర్సును హైదరాబాద్ అధికారులు నిర్బంధించారు. కలబుర్గికి చెందని 76 ఏళ్ల మహమ్మద్ సిద్ధిఖి జనవరి 29న సౌదీకి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 29న భారత్‌కు తిరిగి వచ్చాడు.
Also Read:అలర్ట్... గూగుల్ ఉద్యోగికి కరోనా వైరస్
సౌదీ నుంచి నేరుగా హైదరాబాద్ పాతబస్తీలోని బంధువుల ఇంటికి వచ్చాడు. మార్చి 5 వరకు అక్కడే గడిపిన సిద్ధిఖి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం సిద్ధిఖిని మార్చి 6న తన సొంత ప్రాంతమైన కలబుర్గికి వెళ్లిపోయాడు.
అక్కడ తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతనిని పరీక్షించిన వైద్యుతు కరోనా లక్షణాలు గుర్తించి అతని రక్తనమూనాలను పుణేలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి తరలించారు. ల్యాబ్ నుంచి నివేదికలు రాకుండానే సిద్ధిఖి ఈ నెల 10న మరణించాడు.
పుణే నుంచి వచ్చిన నివేదికల్లో అతను కరోనా కారణంగానే చనిపోయినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం సిద్ధిఖీ ఇంటికి సమీపంలోని వారందరినీ పరిశీలనకు పంపింది. అలాగే అతను సౌదీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు రావడంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా విషయం చెప్పింది.
Also Read:భారత్ లో తొలి కరోనా మరణం.. హైదరాబాద్ లో కర్ణాటక వ్యక్తి మృతి
కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్.. హైదరాబాద్‌లో సిద్ధిఖి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరినీ కలిశాడు అన్న దానిపై సమాచారం సేకరిస్తోంది.
పాతబస్తీలోని సిద్ధిఖీ బంధువులకు, ఆ చుట్టుపక్కల వారికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సిద్ధిఖీ వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి అతనికి సేవలు చేసిన నర్సును పరిశీలన నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.