రెచ్చగొట్టే స్పీచ్ లు: అసదుద్దీన్, వారిస్ పఠాన్ లపై కేసులు

By telugu teamFirst Published Mar 13, 2020, 3:08 PM IST
Highlights

రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, వారిస్ పఠాన్ లపై హైదరాబాదు పోలీసులు కేసులు నమోదు చేశారు. బిజెపి నేత కపిల్ మిశ్రాపై కూడా కేసు నమోదైంది.

హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, మాజీ ఎమ్మెల్యేల వారిస్ పఠాన్ లపై హైదరాబాదులోని మొగల్ పురా పోలీసులు కేసులు నమోదు చేశారు. బిజెపి నేత కపిల్ మిశ్రాపై కూడా కేసు నమోదు చేశారు.

ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే అరోపణపైనే కాకుండా రెచ్చగొట్టే ప్రసంగాలను చేశారనే ఆరోపణపై వారి మీద కేసులు నమోదు చేశారు. ఓ పొలిటికల్ యాక్టివస్ట్ బాలకిషన్ రావు నాంథారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. 

also Read: పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు: అమూల్యను ఆపేసిన అసదుద్దీన్ ఓవైసీ (వీడియో)

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు ఆ ముగ్గురు నేతలపైచట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఇటీవల స్థానిక కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో సిఏఏ అనుకూల ర్యాలీకి నాయకత్వం వహిస్తూ మౌజ్ పూర్ చౌక్, జఫ్ఫరాబాద్ ల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, దానివల్ల ఢిల్లీలో ఘర్షణలు చెలరేగాయని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. 

ఫిబ్రవరిలో కర్ణాటకలోని కలబుర్గీలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో వారిస్ పఠాన్ సీఏఏ వ్యతిరేక సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయన ఆరోపించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ.. వారిపై కేసులు నమోదు చేయాలని స్థానిక కోర్టు మొగల్ పురా పోలీసులను ఆదేశించింది. దీంతో మొగల్ పురా పోలీసులు వారిపై కేసులు ననమోదు చేశారు. 

Also read: 

click me!