హైదరాబాద్‌లో దారుణం: రాత్రంతా బంధించి.. బాలికపై నలుగురి అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితులు

Siva Kodati |  
Published : Jun 21, 2022, 04:45 PM IST
హైదరాబాద్‌లో దారుణం: రాత్రంతా బంధించి.. బాలికపై నలుగురి అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితులు

సారాంశం

హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి దగ్గర దించుతామంటూ రాత్రంతా బంధించి ఆమెపై దారుణానికి ఒడిగట్టారు.   

మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ (gang rape) జరిగిన ఘటన హైదరాబాద్ (ys jagan) చాంద్రాయణగుట్ట (chandrayangutta) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉండే 14 ఏళ్ల మైనర్‌ బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవపడి బయటికి వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురు యువకులు మీ తల్లి దగ్గర దించుతామని నమ్మించారు. అనంతరం ఆమెపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాలిక శనివారం సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఎక్కడికి వెళ్లావని బాలికను నిలదీయడంతో అసలు విషయాన్ని తెలిపింది. దీనిపై బాధితురాలి తల్లి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!