హైదరాబాద్ మెట్రోరైలు టైమింగ్స్ లో మార్పులు

First Published Jul 14, 2018, 12:51 PM IST
Highlights

రోజూ నడిచే మెట్రోరైలు వేళల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ ప్రకటించింది. అమీర్ పేట, ఎల్బీ నగర్ ల మద్య మెట్రో ట్రయల్ రన్ జరుగుతుండటంతో ఈ మార్పులు చేస్తున్నట్లు మెట్రో సంస్థ తెలిపింది.ఈ నెల 16 వ తేదీ నుండి ఉదయం ప్రారంభ సర్వీసుల టైమింగ్ లో మార్పులు ఉండనున్నట్లు మెట్రో సంస్థ వెల్లడించింది.

ప్రతిరోజూ ఉదయం మొదటి రైలు ప్రస్తుతం 6 గంటలకు మొదలవుతుండగా ఈ నెల 16 నుండి అరగంట ఆలస్యంగా మొదలవుతుంది. అంటే 6.30 గంటను నుండి మెట్రో మొదటి సర్వీస్ ప్రారంభమవుతుంది. ఇక ఆదివారాల్లో మరో అరగంట ఆలస్యంగా అంటే 7 గంటలకు మొదటి ట్రిప్ బయలుదేరుతుంది. చివరి ట్రిప్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. అయితే ఈ ప్రస్తుతం చేపట్టిన రైళ్ల సమయాల మార్పులు తాత్కాలికమని, మళ్లీ మార్పులు ఉంటాయని హైదరాబాద్ మెట్రో  ప్రకటించింది. 

అమీర్‌పేట-ఎల్బీనగర్, అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గాల్లో త్వరలో రైలు సర్వీసులు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ మార్పులు చేపట్టినట్లు మెట్రో అధికారులు తెలిపారు.  ప్రస్తుతం అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రో ట్రయల్‌ రన్స్‌ నిర్వహిస్తున్నామని, త్వరలోనే హైటెక్ సిటీ మార్గంలో కూడా ట్రయల్ రన్ మొదలవుతుందని అధికారులు తెలిపారు.

ప్రయాణికులు మారిన మెట్రో రైలు సమయాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని చేపట్టాలని మెట్రో అధికారులు తెలిపారు. త్వరలో మళ్లీ చేపట్టబోయే మార్పుల గురించి ప్రకటిస్తామని నిర్మణ సంస్థ ఎల్ ఆండ్ టీ తో పాటు మెట్రో సంస్థ ప్రకటించింది. 
 
click me!