హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతిక లోపం.. ఎర్రమంజిల్‌లో రైలు నిలిపివేత.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..

Published : Jan 23, 2023, 09:59 AM IST
హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతిక లోపం.. ఎర్రమంజిల్‌లో రైలు నిలిపివేత.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..

సారాంశం

హైదరాబాద్‌ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం ఓ మెట్రో రైలు సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్‌లో నిలిచిపోయింది. ఎర్రమంజిల్ రైల్వే స్టేషన్‌లో మెట్రో రైలును నిలిపివేసిన అధికారులు.. ప్రయాణికులు మరో మెట్రో రైలులో తరలిస్తున్నారు. ఈ ఘటనతో మియాపూర్-ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 


మియాపూర్-ఎల్బీ నగర్ మార్గంలోని మెట్రో స్టేషన్లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు.. రైళ్ల కోసం వేచిచూస్తున్నారు. ఇందుకు సంబంధించి కొందరు సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నారు. మెట్రో చాలా ఆలస్యంగా నడుస్తోందని, ఆకస్మాత్తుగా నిలిపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్