లేడీస్ హాస్టల్స్ నే టార్గెట్ చేసిన టక్కరి దొంగ… చివరికి బావిలో దొరికాడు.. ఎలాగంటే..

Published : Jan 23, 2023, 09:14 AM IST
లేడీస్ హాస్టల్స్ నే టార్గెట్ చేసిన టక్కరి దొంగ… చివరికి బావిలో దొరికాడు.. ఎలాగంటే..

సారాంశం

లేడీస్ హాస్టల్ లో దొంగతనం చేసి కలకలం రేపిన ఓ దొంగ విచిత్ర రీతిలో దొరికిపోయాడు. ఈ ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. 

హనుమకొండ : ఓ వ్యక్తి లేడీస్ హాస్టల్స్ నే టార్గెట్ చేసుకున్నాడు. అంటే అక్కడున్న మహిళలపై ఏదో అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని కాదు. కేవలం  లేడీస్ హాస్టల్స్ లోనే దొంగతనాలు చేస్తున్నాడు. ఆ తర్వాత చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో  అనూహ్యంగా  పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో జరిగింది. అక్కడి ఎన్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ  గర్ల్స్ హాస్టల్లో లాప్టాప్ లు, సెల్ ఫోన్లు  దొంగతనం జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. హాస్టల్లోనే ఓ బాత్రూమ్ డోర్ ను బద్దలు కొట్టి మరి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనతో విద్యార్థినులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. తమకు రక్షణ లేదంటూ అదే రోజు కాలేజీ ఎదుట భద్రతా వైఫల్యం అంటూ ఆందోళన చేపట్టారు. అయినా కూడా ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. దొంగ దొరకలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అయితే, అందరినీ తన దొంగతనంతో హడలెత్తించిన సదరు దొంగ..  ఊహించని రీతిలో దొరికిపోయాడు. ఊరికి దూరంగా ఉన్న హాస్టల్లో..  సెల్ ఫోన్లు, లాప్టాప్ లను దొంగిలించిన తర్వాత.. పారిపోయే క్రమంలో.. రాత్రి చీకట్లో పొలాల వెంట పరుగులు పెట్టాడు. చూసుకోకుండా.. చీకట్లో కనిపించక ఒక వ్యవసాయ బావిలో పడిపోయాడు. 

హైదరాబాద్ : నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి కత్తులు, కొడవళ్లతో దారుణ హత్య.. చనిపోయిన వ్యక్తి ఎవరంటే...

బయటికి రాకుండా అందులోనే ఉంటే చనిపోవడం ఖాయం..  బయటికి రావాలంటే ఎవరైనా సహాయం చేయాల్సిందే..  అలా తాను దొరికిపోవడం ఖాయం. ఏం చేయాలో తెలియని సంకట పరిస్థితి.  అయినా కూడా ప్రాణాలు పోవడం కంటే దొరికిపోతే ఎలాగోలా తప్పించుకోవచ్చు అనుకున్నాడేమో గట్టిగా కేకలు వేశాడు. ఉదయం పూట బావి పక్క నుంచి వెళుతున్న స్థానికులు అతనికేకలు విన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు  బావిలోకి తాడువేసి అతని పైకి లాగారు. ఆ తర్వాత  అదుపులోకి  తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu