రెండో రోజూ విధులకు దూరంగా హైద్రాబాద్ మెట్రో కాంట్రాక్టు ఉద్యోగులు: వేతనాలు పెంచాలని డిమాండ్

By narsimha lodeFirst Published Jan 4, 2023, 12:05 PM IST
Highlights

హైద్రాబాద్ మెట్రోలోని టికెటింగ్ విభాగంలో  పనిచేస్తున్న  కాంట్రాక్టు  ఉద్యోగులు  ఇవాళ కూడా విధులకు  దూరంగా  ఉన్నారు. తమ డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు. 

హైదరాబాద్: హైద్రాబాద్  మెట్రో లో  టికెటింగ్ కౌంటర్లలో  పనిచేస్తున్న  కాంట్రాక్టు ఉద్యోగులు   రెండో రోజూ కూడా విధులు బహిష్కరించారు. అంతేకాదు తమ సమస్యలను పరిష్కరించాలని  ఆందోళన నిర్వహించారు. హైద్రాబాద్ మెట్రో  రైల్వేలో ని టికెటింగ్ విభాగంలో  పనిచేస్తున్న  కాంట్రాక్టు  ఉద్యోగులు  నిన్నటి నుండి  విధులకు దూరంగా  ఉన్నారు. నిన్న  ఉదయం నుండి  ఉద్యోగులు   విధులకు దూరంగా  ఉన్నారు. నిన్న  ఒకసారి  హైద్రాబాద్ మెట్రో రైల్వే యాజమాన్యం  కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతినిధులతో చర్చించింది. అయినా కూడా కాంట్రాక్టు  ఉద్యోగుల సమస్యపై మెట్రో యాజమాన్యం తేల్చలేదు. దీంతో ఇవాళ కూడా  కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు.

ఎల్ బీ నగర్  మియాపూర్ రూట్ లో  ఉన్న 27 టికెటింగ్ కౌంటర్లలో  పని చేస్తున్న  కాంట్రాక్టు  ఉద్యోగులు విధులకు దూరంగా  ఉన్నారు.తమ  వేతనాలు  పెంచాలని  కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు. ఐదేళ్ల క్రితం విధుల్లో చేరిన వారికి  రూ. 11 వేల వేతనం ఇస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన వారికి కూడా  రూ. 11 వేలు చెల్లిస్తున్నారు.  సీనియర్లు, జూనియర్లకు  ఒకే వేతనం చెల్లించడంపై  కాంట్రాక్టు ఉద్యోగులు  అసంతృప్తిని వ్యక్తం  చేస్తున్నారు.   తమ వేతనాలు పెంచాలని కోరుతున్నారు. 

click me!