
హైదరాబాద్ మెట్రో (hyderabad metro) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హాలిడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు వీలుగా ప్రయాణికులకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్లో సూపర్ సేవర్ కార్డును ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవుల్లో రూ. 59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చని కేవీబీ రెడ్డి చెప్పారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని తెలిపారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ సూపర్ సేవర్ కార్డు ఉపయోగపడుతుందని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.
కోవిడ్ కారణంగా గత రెండు ఏళ్లుగా ప్రజలు బయట ఎక్కువగా తిరగలేకపోయారని కేవీబీ రెడ్డి చెప్పారు. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలు పుంజుకుంటున్నాయని వెల్లడించారు. ఇక, మెట్రో సువర్ణ ఆఫర్‌లో భాగంగా లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన ఐదుగురు విజేతలుగా ప్రకటించారు. వారిని బహుమతులు అందజేశారు.
మెట్రో ప్రకటించిన సెలవులు ఇవే..
ప్రతి ఆదివారం, ప్రతి రెండో, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోగ్సవం, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగి, శివరాత్రి, సంక్రాతి