నేటి నుండి మూడు రోజుల పాటు తెలంగాణలో సీఈసీ బృందం పర్యటన: ఎన్నికల సన్నద్దతపై సమీక్ష

By narsimha lode  |  First Published Oct 3, 2023, 9:45 AM IST

తెలంగాణలో ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు ఈసీ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.  అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతపై  ఈసీ ప్రతినిధులు సమీక్ష నిర్వహించనున్నారు.


హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించనుంది. మంగళవారం నుండి  మూడు రోజుల పాటు  సీఈసీ  రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం  పర్యటించనుంది.  మొత్తం  17 మంది అధికారులు  రాష్ట్రంలో పర్యటించనున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతపై  సీఈసీ నేతృత్వంలోని బృందం  సమీక్ష నిర్వహించనుంది. 

మంగళవారంనాడు మధ్యాహ్నం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. ఇవాళ సాయంత్రం ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో  సీఈసీ బృందం సమావేశం నిర్వహించనుంది.మరో వైపు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కూడ  సీఈసీ బృందం  ప్రత్యేకంగా సమావేశం కానుంది.  ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహిస్తుంది. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి  దిశా నిర్ధేశం చేయనుంది.ఓటర్ల జాబితా,  ఈవీఎంల విషయమై కూడ కేంద్ర ఎన్నికల సంఘం  సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

Latest Videos

undefined

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో  సీఈసీ బృందం  సమావేశం కానుంది. ప్రతి పార్టీ నుండి ముగ్గురు ప్రతినిధులకు ఈసీ ఆహ్వానం పంపింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి  రాజకీయ పార్టీల నుండి సూచనలు, సలహాలను స్వీకరిస్తుంది.  అంతేకాదు రాజకీయ  పార్టీల నుండి  ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించనుంది.

రేపు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  సీఈసీ బృందం భేటీ కానుంది.  ఎల్లుండి దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , డీజీపీలతో  సీఈసీ సమీక్ష నిర్వహించనుంది.

తెలంగాణలో ఎన్నికల సన్నద్దతపై మూడు రోజుల పాటు సీఈసీ బృందం సమీక్ష నిర్వహిస్తుంది.2018 డిసెంబర్ 13న బీఆర్ఎస్ సర్కార్ కొలువుదీరింది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ 12 నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి.డిసెంబర్ 12 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ఈసీ  కార్యాచరణను సిద్దం చేసే అవకాశం ఉంది.మూడు రోజుల పాటు  తెలంగాణలో పర్యటించిన తర్వాత  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను  ఈసీ ప్రకటించే అవకాశం ఉంది.

click me!